Others

శరదృతువుకు స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణ భాద్రపదాలవి
ఏవో పలువిధములైన ఇబ్బందులు తె
చ్చే వర్షర్తువు ముగిసెను
ఈ వేల్టితో శరతువచ్చియిడు బహుసుఖముల్

ఎన్ని వత్సరాల్గడిచెనో ఎంచుటకయి
ఋతువులు వసంత శరతులన్ ఎంచురీతి
తెలుగు సంప్రదాయమునందు తెలిసినదియె
అట్టి శరతుకాలమున కాహ్వానమనెద

దేవీ నవరాత్రులలో
కోవెలలన్ దేవిపూజ కోలాహలముల్
దేవతలే దిగిరాగా
పావిత్య్రత పంచ శరతుప్రారంభమగున్

వానాకాలము ముగియగా వరుసజేసి
శాత్రవులు ద్రుంచు వ్యూహాలు శాయనగును
రణమునకు వేగ శరతులే రమ్యమైన
సమయమని ఎంచిరే మనక్ష్మాపతులిట

వర్షఋతువుముగిసె వానిని చంపించు
ముందు ఇడిన మాట మూల బడియె
సుఖములందు మునిగి సుగ్రీవుడౌరాజు
సీత వెదకుపనిని చేయరాడు
మంచినట్టి ప్రతిన మదికిస్ఫురించెను
లక్ష్మణుణ్ణిజూడ లక్ష్యమెరిగి
శరతువచ్చెననుచు సంతోషమునలేచి
వేగిరసడె సీత వెదకుపనిలొ

విజయదశమినాడు విజయముచే బట్టి
సీమ లంఘనమ్ము చేయు ప్రథలు
గ్రామవాసులందు కన్పించు నేటికిన్
అరులపైని విజయ మందినట్లు

శరతుకాల విచిత్రముల్ చాలగలవు
అంబరము మేఘమావృతంబైన కూడ
వర్షములు పడవని మొక వాదుకలదు
ఘర్జనల్ చేసి మేఘాలు కదలివెడలు

ఎండలు తగ్గిపోయినవి హెచ్చుగముంచెడు వానలాగెనే
మెండుగ హాయి నిచ్చెడి సమీరము వీచెడి రోజు లాయెనే
నిండుగ శుక్ల పక్షముల నింగిని శోభిలుచందమామతో
పండుగ పౌర్ణమీ సుదలు పంచుశరత్తులు మోదుపొప్పగాన్

అందుకె సంఘశాఖలలో ఆర్.ఎస్.స్‌లో
ఆడుచుపాడుకొజాగరీయనే
సందడి చేయుచున్ పిదప శాంతత కూర్చెడి
పౌర్ణమీసుధల్
చిందెడి వెనె్నలల్పడగ చిక్కటి క్షీరము తృప్తితీరగా
అందరు కూడి త్రాగెదము హార్దిక సౌఖ్యము స్వాగతించుచున్

బయటను ఇంటను పైపైకి యెగబడు
పొంచిన రిపులను ద్రుంచనెంచి
అప్పులన్ తెగయిచ్చి ఆర్థిక స్సాన
మనలముంచెడి వార్ని మడియ జేసి

మన సంస్కృతిని మాపి మనమనమ్ములలోన
పరధర్మబోధనల్ గరపువార్ని
మతమార్పిడుల్ జిహాద్ మహామారిగావేసి
హైందవీ శక్తుల నణచు వార్ని

పోరిగెలిచెడు యాత్మ సంస్కార మిచ్చి
శక్తియుక్తుల నిడి మము ముక్తిపథము
చేర్చి దీవించు శ్రీశక్తి చిత్తమందు
మెలగునటుల రుూ నవరాత్రి వెలయుగాత

ఆసురీ శక్తుల కొచ అవని యందు
వివిధ యవతారముల దేవి నవమివరకు
పోరుసలిపి నిర్జించె సంపూర్తిగాను
పాశవిక శక్తి పొంతెను పరిసమాప్తి
విజయ దుందుభుల్ మ్రోగెను విశ్వమందు
దశదిశలలోన జయమాయె దశమినాడు
శాంతి స్థాపనార్థము జేయు సమరమందు
కీర్తి నొసగెడు విజయ సంకేతమటుల

పాండవుల ఆయుధాలను పరులకంట
బడగ నీ కుండ రక్షించి ప్రణుతికెక్కి
జన్ని వృక్షము వారినజ్ఞాత మందు
బ్రోచి రక్షించెనను కీర్తి పొందినదయె

జమ్మికి ప్రదక్షిణమ్ములు
ముమ్మారుగ జేయ భక్తిముక్తి నిడంచున్
నమ్మి సువర్ణముగా ప
త్రమ్ముల పంచేటి రీతి రమణీయ మెగా

జమ్మి చెట్టును పూజించి స్వర్ణమనుచు
భక్తి విజయదశమి జమ్మి పత్రితెచ్చి
బంధుమిత్రులందరకును పంచి యిచ్చు
సంప్రదాయము నేటికిన్ సారునిచట

ఆశ్వయుజ అమావస్యకు అంధకార
మన్నదేవేక దీపాల ఆవళులతొ
ప్రభలు వెదిల్లి ప్రేల్తుము బాణసంచ
భారతిని నిల్పెదము కీర్తి పథమునందు

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం 9440156018