Others

ఏదో ఏదో (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్క్‌లో మంచి పాటలున్నాయి. 2012 ఫిబ్రవరి 24న విడుదలైన ఆ సినిమాలోని ‘ఏదో ఏదో’ అనే పాట -మొత్తం ఆరు పాటల్లో ‘ఆణిముత్యం’ అని మాత్రం అనొచ్చు. మిగతా పాటలూ వినడానికి బాగున్నా.. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం రంగరించిన ఫీల్ ఆడియన్స్‌కి అందుతుంది. 4 నిముషాల 32 సెకండ్లు వుండే పాటను కళ్యాణినాయర్, ప్రదీప్ విజయ్‌లు పాడారు. విక్రం కె కుమార్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎం విక్రమ్‌గౌడ్ నిర్మాతగా వచ్చిన చిత్రానికి అనూప్‌రూబెన్స్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. పీసీ శ్రీరాం ఛాయాగ్రహణం ఓ మాయ. నితిన్, నిత్యామీనన్‌ల ‘రసాయన శాస్త్రం’ ప్రేమ చిత్రాలు తీసే దర్శకులకు ఓ ‘అస్త్రం’లా ఉపయోగపడింది. వారి స్వచ్ఛమైన చిరునవ్వుతో కూడిన ముఖాలు గ్లామర్ అనే పదానికి పర్యాయాలు అయ్యాయి. క్లోజప్‌లో కూడా ఫ్రెష్‌గా ఉన్నారిద్దరూ. ‘ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో/ ఏదీ అర్థంకాదు పైకి చేతల్లో/ ఇంకా ఏదో దాగేవుంది మాటల్లో/ ఏదేమైనా చేయి వెయ్ చేతుల్లో’ అంటూ హాయిగా సాగిపోయే ఈ పాట ఓ జర్నీ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. గాయనీ గాయకుల గొంతుల్లోని క్లారిటీ, డామినేట్ చేయని సంగీత ధ్వనిలో స్పష్టంగా వినపడుతుంది, కనపడుతుంది. ‘అనంత్‌శ్రీరామ్’ సాహిత్యం అందించిన పాటలోని పదాలు అర్థవంతంగా, లోతుగా, రైమింగ్‌తో కూడి ఉంటాయి. ‘ప్రియాప్రియా’, ‘చినదానా నీకోసం’, ‘సూటిగా చూడకు’ వంటి పాపులర్ సాంగ్స్ మధ్య ఈ పాటను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవల మా మాజీ క్లాస్‌మేట్ ఒకమ్మాయిని నీకిష్టమైన ఇటీవలి టాప్ టెన్ సాంగ్స్ లిస్ట్ పెట్టమంటే అందులో ఇది ఒకటిగావుంది. వెంటనే వినేసరికి దీని భావం బోధపడింది. అడుగునపడి పాపం గుర్తింపునకు నోచుకోని ఈ ‘ఆణిముత్యం’ లాంటి పాటను కావాల్సినపుడు నెట్‌లో చూడొచ్చు, వినొచ్చు.

-కెవి చంద్ర, కావలి