Others

పాపనాశిని పరమేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనీ
అర్జునస్య ధనుర్థారీ
రామస్య ప్రియదర్శినీ’ అని స్తోత్రం చేసి ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ‘‘రాజా! దుష్టగ్రహాలు పీడిస్తున్నప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు దేవీ ఉపాసన సత్ఫలితాలను, గ్రహాలు శాంతి పొందుతాయని, అన్నింటా విజయాన్ని అందిస్తుంద’ని చెప్పిన విషయాలను గుర్తుచేసుకొంటూ మహాభారత పఠనం చేస్తారు., త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దేవిని పూజించినందువల్లే రావణుడి వంటి దుష్టుని దునుమాడే శక్తి వచ్చిందనే విషయాన్ని స్మరించుకుంటూ నేడు సాంస్కృతికకళలను ప్రోత్సహిస్తూ రామలీల ఘట్టాలను ప్రదర్శిస్తుంటారు. ‘రామలీలా ఉత్సవాలు’ చేస్తారు. అధర్మం మీద ధర్మం సాధించిన విజయమే దసరాఅని దేవాలయాల్లోను ప్రత్యేక పూజలు జరుపుతుంటారు.
పరాశక్తే అమ్మయనా వరగర్వంతో సృష్టిని అతలాకుతలం చేసే దానవులు తుదముట్టించడానికి తాను త్రిశక్తిదాయని అయంది. మహావిష్ణువు మధుకైట భులను నాశనం చేసే శక్తిని ప్రసాదించి లక్ష్మీరూపును ధరించి వైకుంఠుని ఇల్లాలైంది. పరమేశ్వరిని ఇల్లాలై పార్వతీ మాతగా పరమేశ్వరి అర్థాంగిగా అర్థనారీశ్వరతత్వాన్ని బోధించింది. శివశక్తుల కలయకే సృష్టిఅని నిరూపించింది. అటువంటి అమ్మను శరన్నవరాత్రుల పేరిట ఆశ్వయుజమాసంలో మాలో ఉండే దుర్గణాలను తొలగించి సత్వగుణాన్ని అణువణువునా నింపమని ప్రార్థిస్తారు. ఈ దసరాకు మరోపేరు ‘దశహరా’. అంటే పది పాపాలను హరించేది అని అర్థం కూడా ఉంది

- వాణీమూర్తి