Others

శ్రీచక్ర సంచారిణీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా॥ వాచాహేయము, అస్థిర ప్రమద శోభాభాస దుర్మోహద
స్ర్తి చక్రంబున, లాభలోభ వివశ స్వేచ్ఛా విహీన వ్యధా
శ్రీచక్రంబున, జన్మమృత్యు రుదిత క్ష్వేళాకరాళ క్రియా
శ్రీచక్రంబున, మున్గితేలు మము సుస్నేహార్ద్ర మోక్షార్హద
శ్రీచాతుర్య కళాప్రభన్ గనగదే! శ్రీచక్ర సంచారిణీ!

సీ॥ ప్రక్కలోన తు‘పాకి’ ఫక్కి నాత్నరా
క్షసుల గూల్చగ ఆదిశక్తి! రావె!
సైబరు ‘సెల్లు’లై శాంతిని గూల్చు రా
క్షసుల చంపగ పరాశక్తి! రావె!
నవయించు దసర చందామామలైన దా
నవుల ద్రుంపగ శంభునారి! రావె!
సీరియల్స్ టీవీల జిడ్డుతో కాల్చుక
తిను రక్కసుల చీల్చ దేవి! రావె!
కుంభకోణమే భువిని ఏ కోణము గన;
నాణెమేలేని వారి దృక్కోణ మణచి
త్రాతగా వెల్గ ఓ జగన్మాత! రావె!
వెలయుగద! నాడె నిజమైన విజయ దశమి!

-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287