Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపిరాడక చచ్చిపోతుంది
నీలిదీవుల్లో
పూల మబ్బులు కదలటం చూసి
పరిమళాల పసిగాలుల్ని ఱెక్కలలో నిమురుతూ
ఒళ్లురిచి ఓనెమలి
పింఛాన్ని ఓరగా ఆరవేసుకుందంటే
తక్షణం ప్రచాలాకి ప్రజాస్వామ్యానికి
పంక్తి భోజనవౌతుంది
మైలపడిందో లేదో కాని మనుజ జన్మ
అందమును హత్యచేసెడి హంతకుడు మాత్రం
బుద్ధదేవుని భూమిలోనే పుట్టాడు
అమావాస్యని పూచిన ఆకాశం
పక్షిలేని తోటమీదికి పగలు కక్కుతూ వాలింది
అంతరాత్మ కల్లోలానికి ఆకుల పాటుతో
ఆకులన్నీ రాలిపోయాయి
శకలాలై ఎగిరిపోయింది మానవతా శ్మంద
నగ్నత్వానికి నగిషీలు చెక్కుతోంది శతాబ్దం..
***
స్వేచ్ఛానగ్నత్వానికి
సాధిష్టయోగమబ్బదని
తత్కాల ప్రయోజన సాధనగా
తనువెల్లా ఆఖ్రమించుకుంకటుందని
వౌనంగా వున్న కాలాగ్ని నేత్ర దీక్షలో
అభివ్యక్తి- అభినయం వ్యక్తిగతం కాదని
అస్తమమత్వం అహస్కరునికి లేదని
కొడిగడుతున్న దీపానకి కునికిపాటు తప్పదని
చెప్పాలనుకున్నచెలిమికి - గొంతురాదని
బిక్కచచ్చి దిక్కులు దీనంగా ముఖం పెట్టాయి..
గగనంలో నక్షత్ర నగరాలు
తగలబడుతుంటే
చిగురాకు నీడలోని చైత్రానికి
జ్వరమొచ్చింది
నిన్నటి జీవన వ్యవసాయ క్షేత్రంలో
ఆత్మసస్యాన్ని పండించిన వారంతా
ధాన్యపు గింజలై నేడు వెలికి వద్దామనుకుంటే
నాగరకత దెబ్బలతో నాగలి విరిగింది
ఏ నక్షత్రం కోవసం నిరీక్షిస్తూ ఈ యుగసంధ్యను
నెత్తికెత్తుకున్నానో
ఆ పాటు చరణించని ఈ పక్షి
పంజరంలో శాశ్వతబంది..
ఇతనెవరో కళ్ళను చేతి కప్పుక్రిందికి చేర్చి
- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404