Others

పెళ్లి ‘కళ’ తెచ్చేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లి.. ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం. అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారు కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు.. అందం మీ స్వంతం.
అందానికి మెరుగులుదిద్దే ప్రక్రియలో బ్యూటీపార్లర్లు వెలిశాయి. పల్లెల్లో కూడా కొందరు మహిళలు హౌస్ బ్యూటీషియన్లుగా తయారయ్యారు. అయితే ఎవరి సహాయం లేకపోయినా మీరు బ్యూటీగా తయారుకావచ్చు. బ్యూటీషియన్స్ అందుబాటులో లేరని ఏ మాత్రం చింతించవద్దు. కొద్దిపాటి ప్రణాళికతో సొంతంగా ఎవరినివారే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు సుమా! కావాలంటే చూడండి!
పెళ్ళి ఆలోచన మొదలైనప్పటినుంచే అతివలు తమ జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో.. సరైన వేళ పాటించడమూ అంతే అవసరం. జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది. తాజాపండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్‌లాంటివి శక్తినివ్వడమే కాదు మేని ఛాయను మెరిపిస్తాయి.
నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. ఎక్కడపడితే అక్కడినీరు తాగనే కూడదు. మినరల్ వాటర్ అయితే ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీలైతే పండ్లరసాలను సేవించండి. కళ్ళచుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.
మీ పెళ్ళి వేసవికాలంలో జరుగుతున్నా, శీతాకాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళా దుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
శుభఘడియలు దగ్గరపడినకొద్దీ.. మీ తయారీ వేగవంతమవ్వాలి. వారం, పది రోజుల ముందు వ్యాక్సింగ్ చేయించుకుని ఆ తర్వాత మళ్లీ పెళ్లి ముందురోజు చేయించుకోవడం అవసరం. పార్లర్‌లో బ్రైడల్ మేకప్ చేయించుకుంటున్నట్లయితే మీ పెళ్ళి తేది, సమయం చెప్పి ముందుగానే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజులముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భంకోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే.. రిహార్సల్స్ అన్నమాట.
పెళ్లికి ఒక రోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గరకొచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్.. మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్లనిండా కమ్మని కలలతో ఆనందరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికేది పెళ్ళికళ!

- తులసిజ్యోతి 83330 66000