Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదరిళ్ళు ఎదలు విప్పుకున్న పొలుసులన్నీ
తోటమీద పడి ఆడుకుంటున్న తొందరలే...
నాకెందుకో
కాలం కనురెప్పలమాటు కనికరంగా
కలల్ని కదిలించినట్లుంది
కాలం తిరిగి తిరిగి
జీవితాన్ని- తరాల
తరంగాల కందిస్తూన్న విధిగానే కనిపించింది
నాకెందుకో
కాలం తామరాకు మీద నీటి బిందువుగానే
కనిపిస్తోంది
పరిసరాల రంగుల కలబోతలన్నీ కూడా...
***
ఆశో- ధ్యాసో
మగతో- జడతో
కాలం మనిషిని ఇంద్రజాలంలో పడేస్తుంది
మొగ్గ పూవు అవటమంటే
నిశ్శబ్దంగా వున్న శబ్దం
నిగళాలు తెంచుకోవటమే
చెట్టు వసంతాన్ని
కూత పూతలతో నింపుతుంది
ఎండతగలంగానే ఏఱుదాటిస్తుంది
తొగరు చిగురు తోటలో
కనిపించని పక్షికెంత పొగరో
రెచ్చగొడుతున్న గొంతు చెబుతుంది
స్వప్న సౌందర్య సౌకుమార్యాన్ని
కనుఱెప్పల మాటుకు చేర్చి
మెలకువ సూదులతో గుచ్చుతుంది
ఆత్మ గీతాన్ని అలరు తావిగా- ఆత్మీయంగా
ఆవిష్కరిస్తున్న శబల నికుంజం
అంతలోనే అనాదృత చిత్రవౌతుంది
చివురు జొంపాల వెచ్చని కవుగిలింత
చిందువారెడు కాంతి మరంద లహరి
ఎండిపోయిన సృదయాన ఇంకిపోవు
చెవిసోకి పరువెత్తు సెలయేరు ఏది
వినువీధి తెలిమబ్బు కనుసైగ ఏది
వలపు పిల్లనగ్రోవి వాయించువాడేడి
దెసల పరికించు బాష్పార్ద్ర దృష్టి ఏది
ఆశో- ధ్యాసో
మగతో- జడతో
కాలం మనిషిని ఇంద్రజాలంలో పడేస్తుంది..

- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404