Others

పారిశుద్ధ్య పనికి ధైర్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారికి అది నచ్చలేదు. కానీ ఇలాంటి పనులతోనే స్వాతంత్య్రం సంపాదించవచ్చని గాంధీ విశ్వసించాడు. ఆయన అనేకసార్లు భారతదేశ యాత్రలు చేశాడు. ఎక్కడికి వెళ్లినా పారిశుద్ధ్య లేమి ఆయనకు ఏదో ఒక రూపంలో ఎదురుపడేది. సత్రాలలోను, రైల్వేస్టేషన్లలోనూ మరుగుదొడ్లు , మూత్రశాలల కంపు దుర్భరంగా ఉండేది. పేదలైన గ్రామీణులు ఉపయోగించే రోడ్లు, వారి ఎడ్లు ఎప్పుడూ సక్రమ నిర్వహణలో ఉండేవికావు. పవిత్రజలాశయాల్లో నీరు, పరిసరాలు ఎంత మురికిగా ఉన్నాయో పట్టించుకోకుండానే ప్రజలు వాటిల్లో మునకలు వేయడం ఆయన గమనించాడు. వారే నదుల గట్లను మురికి చేస్తుండేవారు. వారే ఆ నదిలో స్నానం చేస్తుండేవారు. పవిత్ర కాశీ విశ్వనాథ దేవాలయంలోని పాలరాతి నేల అక్కడ చెల్లాచెదురుగా పారవేసిన మురికి పట్టిన వెండి చిల్లర నాణాలతో నిండి ఉండడం చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు. దేశంలో అనేక పవిత్ర దైవస్థలాల ప్రధాన మార్గాలు ఇరుగ్గా, మురికిగా, జారుడుగా ఎందుకున్నాయా అని ఆయన ఆశ్చర్యపోయాడు. రైళ్లల్లో ప్రయాణీకులు రైలు పెట్టెలను భయంకరంగా మురికి చేయడాన్ని ఆయన గట్టిగా ఖండించాడు. భారతదేశంలో బూట్లు, చెప్పులు ధరించగల స్థోమత కొద్దిమందికే ఉన్నా చెప్పుల్లేకుండా బజార్లో నడవలేనంత అపరిశుభ్రంగా వీధులను ఎందుకు ఉంచుతారోనని ఆయన ఆశ్చర్యపోయాడు. ముంబయి లాంటి నగరాలలో కూడా వీధుల్లో నడుస్తుంటే పక్కనే ఉన్న ఇళ్లలోంచి ఎవరైనా మీదకు ఉమ్మివేస్తారేమోనని ప్రజలు భయపడటం ఆయన గమనించాడు. పురపాల సంఘాల సమావేశాల్లో ఆయన తరచుగా ‘‘మీ విశాలమైన రోడ్లు అద్భుతమైన దీపాల వ్యవస్థ, అందమైన పార్కులకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే ఆదర్శవంతమైన మరుగుదొడ్లు, 24 గంటల పరిశుభ్రంగా ఉండే రోడ్లూ లేకుండా అది పట్టణం అనిపించుకోదు. అనేక పురపాలక సంఘాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పారిశుద్ధ్యం పనివారు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మీరెప్పుడైనా గమనించారా? ’’అని ప్రసంగించేవారు..
ప్రజలతో ‘మీ చేతుల్లోకి చీపురు, బక్కెట్టు తీసుకోందే మీ పట్టణాలను , నగరాలను, శుభ్రం చేయలేరు.’ అని చెప్పేవాడు. ఆయన ఒక ఆదర్శపాఠశాలను తనిఖీ చేసినపుడు ‘మీరు మీ విద్యాసంస్థను ఆదర్శవంతం చెయ్యాలంటే మీ విద్యార్థులకు పుస్తకాలలో ఉన్న చదువు చెప్పడంతోపాటు వారిని మంచి వంటవాళ్లుగా, పారిశుద్ధ్య పనివారుగా తయారు చేయాలి’ అని ఉపాధ్యాయులకు చెప్పాడు. విద్యార్థులకు ఆయన సలహా ఏమిటంటే ‘‘మీరు మీ సొంత పారిశుద్ధ్య పనివారైనప్పుడే మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. యుద్ధంలో వీరుడిగా పతకం పొందటానికి ఎంత ధైర్యం కావాలో పారిశుద్ధ్య పనిచేయడానికి అంతే ధైర్యం కావాలి.
ఆయన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న గ్రామస్థులు మలాన్ని మట్టితో కప్పేందుకు నిరాకరించారు. ‘‘ఇదితప్పకుండా పాకీ పనే. మలంవంక చూడటమే పాపం. దాన్ని మట్టితో కప్పిపెట్టటం అంతకంటే ఎక్కువ పాపం’’ అని గ్రామస్తులు అనేవాళ్లు. అనేక గ్రామాల్లో పారిశుద్ద్య పనిని తానే స్వయంగా పర్యవేక్షించేవాడు గాంధి. వారికి ఉదాహరణగా నిలవడం కోసం కొన్ని నెలలుపాటు స్వయంగా బకెట్, చీపురు తీసుకొని గ్రామాలకు వెళ్లేవాడు. స్నేహితులు, అతిథులు ఆయనతో పాటు వెళ్లేవారు. వారంతా బక్కెట్ల నిండా మలాన్ని తెచ్చి గోతుల్లో నింపి వాటిని మట్టితో పూడ్చేవారు. వ్యర్థాలను సరన పద్ధతిలో నాశనం చేయడం కూడా ఒక శాస్త్రం అని గాంధీ భావించేవారు.
ఆశ్రమాలలో పారిశుద్ధ్య పనంతా ఆశ్రమ వాసులే చేసేవారు. గాంధీవారికి మార్గదర్శనం చేసేవాడు. వివిధ జాతులు, మతాలు, రంగుల ప్రజలు ఆశమ్రాలలో ఉండేవారు. కానీ ఆశ్రమంలో ఎక్కడ చూసినా కొంచెం ధూళి కూడా కనిపించేది కాదు. కూరగాయల తొక్కలు , ఆహార వ్యర్థాలు, ఒక ఎరువుల గుంటలో వేసేవారు. సాధారణ చెత్తనంతా గోతుల్లో కప్పేవారు. మలాన్ని కూడా గోతుల్లో పాతి తర్వాతి కాలంలో ఎరువుగా వాడేవారు. స్నానశాలలు ఇతర చోట్లనుండి వచ్చే మురికి నీటిని మొక్కల పెంపకానికి వాడేవారు. పక్కా డ్రైనేజీ వ్యవస్థ లేని ఆశ్రమంలో కూడా ఎక్కడా ఈగలూ, దోమలు, మురుగు వాసనా కనపడేవి కావు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614