వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పెదవి విరచుట తగదాడ పిల్లయునుచుఁ
బాడి గాదది వారలే ప్రతిభఁ జూపి
నిలతురిలపైన వెలుగుచు నేర్పు మీరఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆడపిల్ల పుట్టిందని పెదవి విరచటం ఎంత మాత్రం తగదు. అదెంత మాత్రం న్యాయం కాదు. ఆ ఆడపిల్లలే భవిష్యత్తులో ప్రతిభాపాటవాలను కనబరుస్తూ ఎంతో నేర్పుగా ప్రకాశిస్తూ తమ కాళ్లపైన తాము నిలబడుతారని కర్మసాక్షివైన ఓసూర్యదేవా నీవే తెలియజేయాలి ప్రభూ!
తే.గీ. దేవ దానవులని యెంచ బోవు నీవు
సమము శీతోష్ణముల జూడ సవితృదేవ
కృషి సలుపు వారికెల్ల నీ కృపయు మెండు
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: సూర్యదేవా నీవు అందరికీ ఆరాధ్యనీయుడవే. అందరికీ నీ శీతోష్ణాలు సమానంగానే ఇస్తావు. అంతేకాదు కృషితో నాస్తి దుర్భిక్షం అని కృషి చేసేవారికందరికీ నీ కృప తప్పక మెండుగానే అందుతుంది. ప్రాణికోటి కందరికీ నీ ఆశీస్సులు సదా ఉంటాయ. వారి వారి కర్మానుసారం వారికి జీవనఫలాలను అందించే ఓ సూర్యదేవా! నీ కరుణ సదా అందుకునేలా చూడుమా లోకప్రభూ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262