Others

పండుగ షాపింగ్ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ సమీపిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల పరంగా పండుగ ప్రాశస్త్యం ఎలాగున్నా షాపింగ్ ప్రియులకు మాత్రం నిజంగా పండుగే.. వ్యాపారులకు సంబరమే.. షాపింగ్స్ మాల్స్‌లో ఆఫర్లు.. దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరస్‌తో ఆభరణాల వర్తకులు, ఆన్‌లైన్ ఆఫర్లతో ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఒకటేమిటి? అన్ని రకాలుగానూ ఆఫర్ల జోరు కనిపిస్తోంది. దీపావళికి షాపింగ్ చేయాలనుకునేవారు ఈ సీజన్‌లో ఎలాంటి వస్తువులు కొనచ్చో.. కొనకూడదో.. ఒకసారి చూద్దాం.
* పండుగ ఏదైనా కొత్త దుస్తులు ధరించాలని భావిస్తారు అందరూ. అలాంటి వారికోసం డెబ్భై శాతం వరకూ రాయితీ అందిస్తోన్న సైట్‌లు చాలానే ఉన్నాయి. ఇందుకు బ్యాంకు కార్డుల ఆఫర్లు కూడా జోడిస్తే తక్కువలోనే బ్రాండెడ్ వస్త్రాలను పొందవచ్చు. కానీ ఫిట్ పరంగా, క్లాత్ పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.
* దీపావళి పండుగ అనగానే లక్ష్మీపూజ చేస్తారు అందరూ. లక్ష్మీ పూజ అనగానే అందరికీ తెలుసుకదా.. బంగారం పెట్టడం. సిరికి, పసిడికి ఉన్న సంబంధం పక్కన పెడితే.. పసిడిపై మక్కువ పడిన మహిళ ఉండదనేది వాస్తవం. ఆ రోజు ఏదో ఒక బంగారు ఆభరణం కొని లక్ష్మీ పూజలో ఉంచుతారు ఆడవారు. అలా తమ బంగారాన్ని పెంచుకుంటారు.
* దీపావళి వేళ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అది ఓ కళ. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటిని అలంకరించుకునే సమయం ఎవరికీ ఉండదు. ఫలానా వాళ్లు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు అనే బదులు.. మీరు కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించి ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్ బోలెడు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలంకరించిన తరువాత ఇళ్లు ఎలా ఉంటుందో అని సందేహించాల్సిన అవసరం లేకుండా దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఉంటాయి. కాబట్టి మనకు నచ్చింది కూడా ఎంచుకోవచ్చు. ఇటీవలి కాలంలో పండుగ ఏదైనా విద్యుత్ కాంతులు ఉండాల్సిందే అంటున్నారు చాలామంది. ఆన్‌లైన్‌లో విభిన్న రకాల అలంకరణ విద్యుత్ దీపాలు లభ్యమవుతున్నాయి. కొన్ని అయితే దీపాల్లాగానే వెలులీనుతున్నాయి. ఇలాంటివి కావాలంటే ట్రై చేయవచ్చు.
* సాంప్రదాయాలను అనుసరించడం నవతరానికి కాస్త ఇబ్బందే.. పూజ దగ్గర ఏం ఉండాలి.. ఎలా చేయాలి అనే సందేహాలకు చెక్ పెడుతూ ఆన్‌లైన్‌లో అన్నీ దొరుకుతున్నాయి పూజా సామాగ్రితో సహా. దీపావళి వేళ అవసరమైన పూజా సామాగ్రితో పాటు దివాలీ పూజా తాలీ అంటూ ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుగుతున్నాయి.
* సాంప్రదాయవాదులు ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపాలు పెట్టాలనుకుంటారు. ఆధునికవాదులు క్యాండిల్స్ వెలిగిస్తారు. ఏదైతేనేం.. దీపాలు పెట్టడమే ముఖ్యం కదా.. దీపకాంతుల వేళ ఆ దీపాలు వైవిధ్యంగా కనిపించాలంటే.. డిజైనర్ దియా లేదంటే క్యాండిల్స్ ఇంటికి తెచ్చుకోవడమే.. ఇటీవలి కాలంలో కొంతమంది ఓ అడుగు ముందుకేసి పేపర్ లైట్ లాటిన్స్ కూడా వెలిగిస్తున్నారు.
* దీపావళి వేళ బహుమతులను ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉంది. డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, టపాసులు, దీపాలు.. ఇలా రకరకాల వస్తువులను ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇంకాస్త వైవిధ్యంగా ఉండాలనుకునేవారు చాక్లెట్లు, క్యాండిల్స్, పెన్ హోల్డర్స్, డ్రెస్‌లు, బంగారు నాణేలు.. ఇలా ఎన్నో రకాల బహుమతులను ఇవ్వొచ్చు. ఆన్‌లైన్‌లో దీపావళి గిఫ్ట్స్ అని టైప్ చేస్తే చాలు.. వందల్లో సైట్స్ ఓపెన్ అయి, వేల రకాల బహుమతులు మీ ముందుకు వచ్చేస్తాయి. ఇందులో మీకు నచ్చినది ఎంచుకుని బహుమతిగా అందజేయవచ్చు.