Others

అరవైలో పడితే.. అలవాట్లు మారాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుపదుల వయసు వచ్చిందంటే జీవితంలో మరోదశలోకి వెళుతున్నామని గమనించాలి. అందుకే మన ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు అక్కడే పదవీ విరమణ వయసును నిర్దేశించాయి. దీనిని తమ జీవితానికి విశ్రాంతి దశగా భావించాలి. అంతవరకూ పడిన పాట్లు, బాధలు, టెన్షన్‌లు ఇక్కడితో వదిలేయాలి. జీవితంలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీయాలి. మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి జీవనశైలిని మార్చుకోవాలి. అందుకు సరిపోయే ఆహారం కూడా తప్పనిసరి. అరవై దాటిందంటే ఆరోగ్యం మీద, ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనారోగ్యం పాలుకాకుండా వుండాలంటే ఆహారంలో, తినే సమయంలో మార్పులు చేసుకోక తప్పదు.
తాజాపండ్లలో శరీరానికి కావల్సినన్ని పోషకాలుంటాయి. రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలి. సీజనల్‌గా లభించే పండ్లు తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేలా శరీరతత్వం మారుతుంది. ఆరోగ్యాన్ని కాపాడేవి తాజాపండ్లే. జావ, పాయసం వంటి తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న వారికి ఉపవాసాలు చేస్తే ప్రమాదమే. ముఖ్యంగా మధుమేహం, బ్లడ్‌ఫ్రెషర్ వున్నవాళ్ళు ఉపవాసాల జోలికి వెళ్ళక పోవడం మంచిది. ఉపవాస సమయంలో షుగర్ లెవల్స్ పడిపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కలిగే ప్రమాదముంది.
తేలికపాటి ఆహారంతో పాటు కొద్దిపాటి వ్యాయమం మంచిది. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు నడక మంచి వ్యాయామం. ఆ వయసులో ఎముకల పటిష్టతకు నీరెండలోని విటమిన్-డి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ విధిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ మిస్సయితే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఆహారాన్ని వీలైనంత ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తినాలి. రోజుకు కనీసం ఐదుసార్లు ప్రతి రెండు, మూడు గంటలకోసారి ఎంతోకొంత ఆహారం తీసుకోవాలి. మనసు ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ సవ్యంగానే ఉంటాయి. ఇందుకు యోగా అవసరం. యోగా ఫలితంగా ఊపిరితిత్తులు, గుండెకు అవసరమైన గాలి అందుతూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఎక్కడుంటే శారీరక ఆరోగ్యం అక్కడే ఉంటుంది. మాంసాహారం కంటే కూరగాయలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారప్రియులు స్కిన్‌లెస్ చికెన్, గుడ్డులోని తెల్లసొన, చేపలు తినటం మంచిది. నూనె పదార్థాలు ఎక్కువైతే గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కొవ్వు తీసిన పాలను మాత్రమే తీసుకోవాలి. వృద్ధాప్యంలో అవయవాల పనితీరులో వేగం తగ్గుతుంది. జీర్ణక్రియ మందగించి మలబద్దకం పెరిగే అవకాశం ఉంది. దీనికి నివారణగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ వయసులో డయాబెటీస్, ఆర్థరైటీస్, హార్ట్‌ఎటాక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు శరీరంలో వచ్చే మార్పులను తెలుసుకుంటూ, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

-కైపు ఆదిశేషారెడ్డి