వీరాజీయం

‘నెట్టింట’ బందీలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న రెండో దేశం భారత్. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువే. వేరే చెప్పనక్కరలేదు- చైనా ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా అంతర్‌‘జాలంలో’ ఇరుక్కున్న దేశం అని. భారత్‌లో 63 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారట. మన దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో అంతే సంఖ్యలో ఇంటర్నెట్ ఊసు ఎత్తని వారు కూడా ఉన్నారు. ఇంటర్నెట్ వాడని వారిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నవారే. గ్రామీణ ప్రాంతం అంటూ విడిగామడికట్టుకుని ఉండదు. శివారు ప్రాంతాలు చాలా కీలకం. ఎంతో ఉపయోగం అని మురిసిపోతున్న అంతర్జాల సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్న వారే ఎక్కువ. దానికి కారణం .. ప్రపంచంలో అత్యంత చౌకగా మొబైల్ డేటా లభిస్తున్నది భారత్‌దేశంలోనే. దాంతో గడచిన నాలుగేళ్లలోనే అనేక మంది కొత్తగా ఇంటర్నెట్ వాడకం ఉబుసుపోకకి ప్రారంభించారని ఔత్సాహిక సంస్థలు కొన్ని చేసిన సర్వేలు వక్కానిస్తున్నాయి.
ఇటీవల ఒక సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో విచిత్రమయిన దృశ్యాలు చూశాను. వైద్య పరీక్షల నివేదికలు డాక్టరు దగ్గరకి వెళ్లి ఉన్నాయి. ఆత్రంగా డాక్టరుగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్న కొంతమంది- అటు చూడక తమ తమ మొబైల్స్‌ని తెరచి అంతలో అంత అర్జంటుగా గేమ్స్ ఆడేసుకుంటున్నారు. ఎడంగా కూర్చుని మరికొందరు చాటింగులు, జోకులు దంచేస్త్తున్నారు.. వేలకొలదీ రూపాయలు ధార పోసి కొనుక్కొన్న స్మార్ట్ఫోనులో పిచ్చి ఆకర్షణలు-మనిషి బుర్రలో ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి. కాల్స్ ఉచితం, ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.. చార్జింగు రాయితీ.. ఇలా- అనవసర ప్రకటనలు చొప్పించుకోడం కోసం - డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడు నెలకు సగటున తొమ్మిది జీబీలకు పైనే డేటా వాడుతున్నాడు. అది నెలకు 16 గంటల వీడియోను వీక్షించడంతో సమానం. 2015లో అది 15 నిమిషాలు మాత్రమేనట్లున్నది లెక్క. అయితే నాటికీ నేటికి పెరిగిన అదనపు వినియోగం ఎందుకు? దీనివల్ల వాళ్ళ సంసారాలకి, సంఘానికి అదనపు ఫాయిదా ఏమిటి? నిజంగా ఈ అద్భుత ‘‘వల’’ని సద్వినియోగం చెసే మార్గాలను కనిపెట్టి -అమలు చెయ్యాలి కాని- ప్రలోభాలు పెంచి సొమ్ములు చేసుకోవడం మానాలి అన్నది మన అరణ్య రోదనే.. ఇతర సానుకూల మార్పుల విషయానికొస్తే, ఈ-కామర్స్ మార్కెట్‌లో పోటీ పెరిగి పోయింది. గవర్నమెంటు సైతం ట్వీట్లతో జనాలను సతయిస్తున్నది. ఆన్‌లైన్ వీడియో ప్రసారాల పరిశ్రమ శరవేగంగా పుంజుకుంటోంది. నానా చెత్తతో యూట్యూబ్‌ల దాడి. అందుబాటు ధరల్లో ఫోన్లు దొరుకుతున్నాయి. ఎవరికీ వద్దు..? అందరికి స్మార్ట్ఫున్లు కావాలి. గ్రామీణ జనాభా 66 శాతం, ఇంటర్నెట్ సాంద్రత 25.3 శాతం, పట్టణ జనాభా 34 శాతం, ఇంటర్నెట్ సాంద్రత 97.9శాతంగా ఉన్నదిట. భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్)చెప్పిన లెక్కలు ఇవి. ప్రభుత్వ విధాన పరమైన చర్చల్లోనూ డిజిటల్ వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది.
ఇవన్నీ ఉత్సాహంగానే ఉన్నాయి కానీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ విభజన మాత్రం ఎక్కువగా ఉన్నదిట. ఇంటర్నెట్, ఇతర డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్న వారికి, వినియోగించని వారికి మధ్య వ్యత్యాసాన్ని పూడ్చే ముందు సీరియస్ సామాజిక చింతన అవసరం. అంతే కాదు -ఇంటర్నెట్ అవసరం లేని సాధారణ యువత చేతిలో ఈ సదుపాయం దుర్వినియోగం అవుతోంది. ఇది ఒక నాగరికత లేదా ఒక హోదా అనుకునే కాలక్షేపం రాయుళ్లకు ఆట వస్తువుగా అయింది. అందుకనే విజ్ఞులైనవారు విచక్షణకి కూడా చోటు ఇవ్వాలని ఇంకా సామజిక స్పృహ గల కొంతమంది చాదస్తులు గోల పెడుతున్నారు. గ్రామాలలో వాడకం తక్కువ అంటే సదుపాయాన్ని అశ్లీల అసహ్యకర అనారోగ్యకరమైన వాడకాన్ని ప్రోత్స హించాలన్నమాట.
వైరల్ వైరల్ అంటూ గొప్పగా ఎంత ఫేక్ -అవాంచనీయ దృశ్యాలు సమాచారం జనాల మీద దాడి చేస్తున్నాయో? తెలియనిదెవరికి? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయా ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల లభ్యత, రెండోది ఆయా ప్రాంతాలలో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించగలరా? లేదా? అనేది. అందుకు వారు ఉండే ప్రాంతం, ఆదాయం, జండర్, చదువు, భాష, వయసు... ఇంటర్నెట్ వినియోగాన్ని నిర్వచించే అంశాలలో ఇవి కొన్ని....
భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సాంద్రత 48.4గా ఉంది. దాని అర్థం దేశ జనాభాలో ప్రతి 100 మందిలో 48.4 మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో 66 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా, అక్కడి ఇంటర్నెట్ వినియోగదారులు 25.3 శాతమే. పట్టణ ప్రాంతాల్లో చూస్తే అది 97.9 శాతంగా ఉంది. ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోని 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీలో వెనుకబడిఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో ఇంటర్నెట్ వినియోగదారుల సాంద్రత కూడా అత్యంత తక్కువగా ఉంది. ఇంటర్నెట్ సదుపాయాల లభ్యతపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు,హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో, రాజస్థాన్‌లోని అత్యంత తక్కువ జనాభా ఉండే ఎడారి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్‌లోని దట్టమైన అడవుల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కష్టంగా మారుతోంది. అక్కడి ప్రజలలో మనోవికారాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ మారుమూల ప్రాంతాల్లో చాలావరకు గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలే నివాసం ఉంటున్నారు.
ఇంటర్నెట్ వినియోగంలో పురుషులకు, మహిళలకు మధ్య కూడా వ్యత్యాసం చాలా ఉంది. 16 శాతం మంది భారతీయ మహిళలు మాత్రమే మొబైల్, ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారని మొబైల్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎస్‌ఎంఏ విడుదల చేసిన 2019 నివేదిక వెల్లడించింది. కాని మొబైల్ చేత ధరంచని పడతి మనకి గోచరించదు.
మొత్తంగా చూస్తే, పురుషుల కంటే 56 శాతం తక్కువ మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు. డేటా ఛార్జీలు భారీగా తగ్గాయి కానీ, ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ఆధునిక ఫోన్లను కొనలేని స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో పురుషుల మీద ఆధారపడటం లాంటి కారణాలతో చాలామంది మహిళలు అలాంటి ఫోన్లను కొనలేకపోతున్నారు. ఫోన్లు కొనడంతో పాటు, మహిళల్లో అక్షరాస్యత రేటు, డిజిటిల్ టెక్నాలజీపై సరైన అవగాహన లేకపోవడం కూడా వారు ఇంటర్నెట్ వాడకపోవడానికి కారణాలు. ఇలాంటి కారణాల వల్లే వృద్ధుల్లో చాలామంది ఇంటర్నెట్ వాడలేకపోతున్నారు. డిజిటల్ సాధికారత సమాజంలో విస్తృత అవగాహనను, స్వతంత్రతను పెంచుతుంది. కాబట్టి, తమ సామాజిక కట్టుబాట్లకు అది ముప్పుగా మారుతుందని కొంతమంది భావిస్తున్నట్లు కూడా అనిపిస్తోంది.
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ముఖ్యంగా యువతులు మొబైల్ ఫోన్లు మక్కువగా వాడుతున్నారు. విద్యావంతుల్లో చూసినా గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్‌కు ప్రతిబింబంగా నిలుస్తున్న భారత్‌లో ఇప్పటికీ పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందిట. అందుకోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అందరికీ మొబైల్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ప్రధానమైనది.ఆ కార్యక్రమంలో భాగంగా 2,50,000 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2011లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే, నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు సగం కూడా సాధించలేదు. బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించిన చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకునేందుకు మరింత పటిష్టమైన కార్యాచరణ అవసరమని ప్రభుత్వ జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం కూడా గుర్తించింది. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు, ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్న వెనుకబడిన వర్గాలకు, మహిళలకు, దివ్యాంగులకు మొబైల్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఒప్పుకున్నా నైతిక పరిధిలోకి దీన్ని తేవాలి.
ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్‌డ్ వెపన్... మైండ్ యూ..!
-వీరాజీ

veeraji.columnist@gmail.com 92900 99512