Others

ఇల్లూ, ఇల్లాలూ కన్నా జైలే పదిలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా కెన్సాస్ రాష్ట్రంలో, ముస్సోరీ నదీ తీరంలో వున్న కెన్సాస్ సిటీలో మిన్సినోటా అవెన్యూ దగ్గర వున్న లేబర్ బ్యంక్ భవనంలోకి- బాగా పెద్దమనిషిలాగా వున్న సీనియర్ సిటిజన్ ఒకడు హడావుడిగా వచ్చాడు. నేరుగా బ్యాంకు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి- బ్యాంకు క్లార్కుకి ఓ చీటీ అందించాడు. రెండో చెయ్యి రెండు వేళ్లు తుపాకీలా పెట్టి వున్నాయి. దానిమీద రుమాలు కప్పి వుంది.
బ్యాంకు క్లార్క్ మారుమాట లేకుండా కరెన్సీ కట్టలు తీసి - రుూ గన్ దొంగ ముందుకి నెట్టాడు. ఆ పెద్దమనిషి తాపీగా కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించకుండా- తాపీగా పోయి, బ్యాంకు లాబీలో రిసెప్షన్ కుర్చీలలో కూర్చుని- వొళ్లో డాలర్‌ల కట్టల్ని సర్దుకుంటున్నట్లు కనబడ్డాడు. ఈలోగా క్యాషియర్ మ్రోగించిన అలారమ్‌కి భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. ఆ పెద్దమనిషి బ్యాంకు బయటకు పరుగులు తీసే సెక్యూరిటీ గార్డులను- ‘‘యిటురా, అబ్బీ! యిక్కడా.. యిక్కడా..’’ అంటూ కేకేశాడు.
హడలి చచ్చారు వాళ్లు. అదే భవంతిలో పోలీసుల మకాం కూడా వుంది కనుక- రెడీగా పోలీసులొచ్చారు. ‘‘కేసెట్టుకోండిరా, అబ్బాయిలూ! మా ఆవిడకి కబురు కూడా పెట్టండి’’ అన్నాడా పెద్దమనిషి. డెబ్భై ఏళ్లుంటాయ్. పేరు లారెన్స్ జాన్ రిప్పిల్. చేసేది లేక, ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ముందుకు తీసుకునిపోయారు.
జడ్జీగారడిగాడు- ‘పేపర్లో రుూ శతాబ్దపు వింత చోరీ నేనే చేశానండోయ్ అంటూ గొప్పలు చెప్పుకోడానికా రుూ దోపిడీ డ్రామా?’ అని. కెన్సాస్ సిటీ స్టార్ సహా అన్ని పేపర్లూ రుూ వార్త- ఫొటోలూ- రెండూ దంచేశాయి. ‘‘కాదు యువరానర్! మా ఆవిడతో వేగలేకపోతున్నాను. గయ్యాళి రాక్షసి. చావచంపి చెవులు మూసేరకం. అందుకని దానికి చెప్పేశాను- ‘‘నీతో, రుూ ఇంట్లో కాపురం కన్నా జైల్లో చిప్పకూడు మేలు’’ అని. అంతేనా? నేనా క్యాషియర్ అబ్బాయికి యిచ్చిన వార్నింగ్ చిట్ కూడా ఆమె ముందే రాసి- ‘ఇదుగో పోతున్నా.. జైలుకే పోతున్నా’నంటూ వచ్చేశానన్నాడు. ‘‘ముస్సోరీ నదిలో పడిచావు. ఐడోంట్ కేర్’’ అన్నట్లుందా మహాసాధ్వీమణి.

veeraji