Others

ఎవరు నీవు నీ రూపమేది... (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమలు-పెళ్ళిళ్ళు’ చిత్రంకోసం ఆత్రేయ రాసిన పాట ఇది. ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరపరచగా పి.సుశీల, ఘంటసాల గాత్ర సుధ చిందించారు. తెరమీద రేర్ కాంబినేషన్ ఊర్వశి శారద, అక్కినేని నాగేశ్వరరావు కనువిందు చేశారు. లలిత శృంగార జ్వలిత గీతాన్ని మనకందించి ఇప్పటికి కొన్ని దశాబ్దాలైనప్పటికీ.. ఎప్పటికప్పుడు కమనీయంగా, రమణీయంగానే అనిపిస్తుంది ఈ పాట.
ఈ పాటలో భావప్రాధాన్యత, శబ్దస్వారూప్యత పదము పదములో మోహరించి ఉంటుంది. అలంకారప్రాయంగా, యతిప్రాసబద్ధంగా... సాగే ఈ పాటలో సుగాత్రాల యుగళంతో వాద్యనాదాలు.. రాగ తాళాలు... అనురాగవాదాలు వివరంగా విపులంగా వినసొంపుగా ఆద్యంతం పాటని రక్తికట్టిస్తాయి. ఇదో రకమైన ప్రేమగీతం. ప్రశ్న- జవాబు పరంపరగా సాగే గీతంలో ఆలుమగల అనుబంధం ప్రచోదనవౌతుంది.
‘ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నినే్నమని పిలిచేది’ (ఇది ప్రశ్న), ‘నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేది మీకెలా తెలిపేది’ (్భర్య సమాధానం).
నిదురపోయిన మనసును లేపి మమతను చేసిన మమతవు నీవో/ నిదురే రాని కనులను కమ్మని కలలతో నింపిన కరుణవు నీవో/ పూజకు తెచ్చిన పూవును నేను.. సేవకువచ్చిన చెలిమిని నేను/ వసివాడే ఆ పసిపాపలకై దేవుడు పంపిన దాసిని నేను/ చేదుగ మారిన జీవితమందున తీపిని చూపిన తేనెవు నీవు/ వడగాడ్పులలో వడలిన తీగకు చికురులు తొడిగిన చినుకే మీరు/ కోరిక లేక కోవెలలోన వెలుగై కరిగే దీపము నీవు/ దీపములోన తాపము తెలిసి ధన్యను చేసే దైవం మీరు’-
సంభాషణలా సాగే, తేట తేట తెలుగు అలతి అలతి పదాల తీరే పాటైతే... అది అర్ధమైన చెవులకు తేనెల ఊటేమరి. అక్షరాలను చేర్చి... పదాలను కూర్చి... భావాల్ని పుటంవేసి చేసిన రచన రసనాన్ని కల్గించక ఉంటుందా! అందుకే ఈ పాట నాకెంతో ఇష్టం-

-ఆచార్య క్రిష్ణోదయ, హైదరాబాద్