Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడవ యుగం:
దీనికి కృత్తికా యుగం అన్నారు. 2500 బి.సి నుండి 1400 బి.సి. చైనావారు భారతీయులనుండి ఈ కాలంలోనే పంచాంగం నేర్చుకున్నారు. ఋగ్వేద మంత్రార్థం ఇప్పటికే తెలియని స్థితి వచ్చింది.
చతుర్థయుగం:
దీనిని ప్రాచీన సంస్కృతయుగం అన్నారు. కాలం: 1400 బిసి నుం 500 బి.సి.
ప్రశ్న: పునర్వసు యుగానికి ముందు 8000 బిసి నుండి 6000 బిసి యుగం మాటేమిటి?
అగ్రహాయణ:
ఆరిజన్ ఆఫ్ ది ఆరియన్
మాఘ శుద్ధ పూర్ణిమ హిమవత్ సంక్రమణంగా ఉన్నట్లు తైత్తరీయ సంహిత ఆధారంగా పరిశోధకులు ఊహిస్తున్నారు.
చిత్రాపూర్ణ మాస - ఫల్గుణీ పూర్ణమాస (తై.సం.7-4-8) అని కూడా ఉంది కదా. అంటే ఏమిటి? మాఘ పూర్ణిమ / ఫాల్గుణ పూర్ణిమ / చైత్ర పూర్ణిమ- వీటిలో ఏది ఉగాది?
అంటే సంవత్సరాది? అంటే యజ్ఞారంభాదికం? అని ప్రశ్న.
చైత్రీ / ఫల్గుణీ అని జైమినీ సూత్రాలు / తాండ బ్రాహ్మణము
అగ్రహాయణ = మృగశిర అని అమరకోశము / శబ్దరత్నాకరము
భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అని వుంది.
పాణిని- అగ్రహాయణిక / చైత్రిక అన్నారు.
వసంత విషవత్తు ఒకప్పుడు మృగశీర్షలో వుందా?
మార్గశీర్ష ప్రథమ మాసం కాజాలదు అని పరిశోధకుల అభిప్రాయం.
సారాంశం:
తై.సం.లో చెప్పినట్లు హిమవత్ సంక్రమణం వద్ద ఫాల్గుణ పూర్ణిమతో (హోలీ) సంవత్సరారంభం అయితే-
వసంత విషవత్తు మృగశిర దగ్గర ఉంటుంది కదా!
తాత్పర్యం:
మృగశిర మొదటి నక్షత్రమే కాని మొదటి మాసం కాదు.
- ఫాల్గుణ పూర్ణిమ నూతన సంవత్సరారంభం
- మృగశిర ప్రథమ నక్షత్రం మాత్రమే
(ప్రథమ నక్షత్రం ప్రథమ సంవత్సరం కాదు. అశ్వని - ఆశ్వయుజం ప్రథమ సంవత్సరామా? కాదు. చిత్ర - చైత్ర ప్రథమ సంవత్సరం. ఇదీ తర్కం)
- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668