Others

శివమయరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించడం సర్వోత్కృష్టమైన పూజ
నా సర్వేంద్రియాలూ ప్రాపంచిక విషయాలను ఎరుగకుండు గాక
ఏమీ ఎఱుగని పశువైన నన్ను పశుపతివైన నీవే దయతో రక్షించాలి
నీపాద పద్మముల సేవనే ఎల్లవేళలా నేను యాచిస్తున్నాను

అంధుడనై అజ్ఞాన అడవిలో దిక్కుతోచని పాంధుడనై యున్నాను
నా మనస్సు సంసార వ్యామోహమనే మహారణ్యంలో బ్రహ్మరాక్షసైంది
నీ కటాక్ష వీక్షణమే ఈదీనుని సంరక్షింపదగ్గ శక్తిపాతం
నిర్మలమైన నా మనస్సు మల్లెల పర్ణకుటీరంలోకి ఉమాసహితంగా ప్రవేశించు

నా మనస్సు సుందరాంగనల కుచగిరుల మీదనే తిరుగుచున్నది
ఆశాపిశాచములు పాశములై పాపపు చింతలు కలుగచున్నవి
స్వేచ్ఛగా విశృంఖలముగా శీఘ్రంగా నలువైపుల నా మనస్సు పరిభ్రమించు
చంచలమైన నా మర్కట మనస్సు నీపై భక్తి అనే తాటితో బంధించు

నాసర్వేంద్రియాలలో నుండే ఈ మనస్సనే దొంగను పట్టుకో
బ్రహ్మత్వము పొందినపుడే నాలోని శివుడు నీలోని శివుడితో కలుస్తాడు
నీకేమివ్వగలను? నా కోం మనస్సును నీ కర్పించుచున్నాను స్వీకరించు
బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన నీ దివ్య చరణావిందములపై ఎప్పుడు వ్రాలెదను

నిన్ను స్తోత్రం చేయుటకు నాలుకను ధ్యానించుటకు మనస్సును
ప్రణమిల్లుటకు శిరస్సు ప్రదక్షిణం చేయుటకు నా పాదద్వయం
పూజాభిషేకములు చేయుటకు చేతులు నిన్ను చూచుటకు నాకండ్లు
నీ లీలల కథలు వినుటకు నాకు చెవులిచ్చి నా మనస్సును రంజంపజేయవేమి
ప్రణవానాదం వలన కేకి వయ్యాపు వ్యోమకేశుడవై శిఖి అయ్యావు
ప్రాణశక్తి రూపుడవై ‘సో’ ‘హం’ అను రెండు హంసలైనావు
నెమలి మనోఉద్యానవనంలో నృత్యం చేస్తే నీవు రుద్రనమకచమకములతో ఆనంద తాండవం చేస్తావు
కోటి సూర్య ప్రకాశమానుడవైన నీవు నాకెందుకు కానరావు

విషపూరితమైన నాగాభరణములు ధరించితివి
గజాసురుని చర్మం గజగజ చలిలో చుట్టుకొని ఎగెరెగిరిపడితివి
అసురుని మరణ శోకం నీ కన్నీటి చుక్కలతో జీవులను రక్షించు రుద్రాక్షలుగా జేసితివి
నన్ను భూషణంగా ఎందుకు స్వీకరింపవు నీ ఆదరణకు నోచుకోని పాపినా నేను

- ఆర్.లక్ష్మణమూర్తి, 7207074899