Others

బరువును తగ్గిద్దామా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు నిజంగా భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. కొంతకాలం మితమైన ఆహారం తీసుకోవడం, సాధారణ వ్యాయామం చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. ఇది సరైన ప్రణాళిక, ఆపేక్షపూరిత ఆలోచనను దాటి బలమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సాధ్యం అవుతుంది. బహుశా బరువు కోల్పోయే పని క్లిష్టమైన, సంక్లిష్టంగా చేసే అనేక క్లిష్టమైన బరువు నష్టం ప్రణాళికలు ద్వారానే బరువు తగ్గడం అనుకుంటున్నారేమో అలా కాదు. బరువు కోల్పోవడం కోసం ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం వేసుకున్న ప్రణాళికను జాగ్రత్తగా స్థిరంగా పాటించడం అవసరం.
* ఉదయానే్న పరగడుపున నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం చాలామంచిది. నిమ్మరసం మీ శరీరంలో శక్తిని పెంచడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా బరువు పెరగడాన్ని అణచివేసే అవసరమైన పోషకాలను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అంతేకాక శరీరానికి విటమిన్ సి, ఇతర అనామ్లజనకాలు సమృద్ధి అవడానికి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బరువు కోల్పోయిన తర్వాత కూడా దాన్ని మెయిన్‌టైన్ చేయడానికి నిమ్మరసం ప్రతిరోజూ తీసుకోవాలి.
* ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో చక్కగా సహాయపడుతుంది. ఎసిటిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. అంతేకాదు శరీరం తీసుకునే ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు, ఇనె్ఫక్షన్స్ రాకుండా చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు స్పూన్లు కలిపి తాగేయాలి. రోజూ సాయంత్రం దీన్ని తీసుకోవాలి.
* బరువు తగ్గాలనుకునేవాళ్లు ప్రతిరోజూ గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది బరువు తగ్గించడంతో పాటు, జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
* ఆరోగ్యకరమైన మార్గంలో సన్నగవ్వాలనుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మితమైన, చురుకైన శారీరక శ్రమ కలయికతో బరువును కోల్పోవచ్చు. అలాగే బరువును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. జాగింగ్, రన్నింగ్ వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. కానీ ముప్ఫై దాటిన వాళ్లు మాత్రం డాక్టరు సలహాతో మాత్రమే ఇలాంటివి చేయాలి.
* అంతేకాదు వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఇది టైప్-2 మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది. వ్యాయామ నియమానికి మీ రోజులో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవాలి. రోజులో కనీసం అరగంట తప్పకుండా వ్యాయామం చేయాలి.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంటే పచ్చటి ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, తృణధాన్యాలపై దృష్టి పెట్టాలి. వేయించిన, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తే త్వరగానే బరువు తగ్గవచ్చు.