Others

విజ్ఞాన రంగంలో ధృవతార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా మతం సైన్సు.. దానే్న జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రానే్వషణలో గడిపిన దార్శనికుడు సర్ సీవీ రామన్. అతని పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ గ్రామంలో 1888 నవంబర్ 7న చంద్రశేఖర అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించాడు. చిన్నతనం నుండే రామన్ విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ప్రయోగశాలకు, గ్రంథాలయానికి నిత్యం వెళ్తూ శాస్త్ర సంబంధ విషయాలను అధ్యయనం చేసేవారు. 18వ ఏటనే ‘కాంతి’పై ఆయన రూపొందించిన పరిశోధనాత్మక పత్రం ప్రపంచ విజ్ఞాన శాస్తవ్రేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్‌లో దేశంనే ప్రథముడిగా నిలిచి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్టుమెంటుగా నియమితులయ్యారు. దాదాపు పదేళ్ళు ప్రభుత్వ సర్వీసులో ఉండి కలకత్తా, రంగూన్, నాగపూర్‌లలో పనిచేశారు.
కలకత్తాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ ఆయనలోని విజ్ఞాన తృష్ణకు ఊతం ఇచ్చింది. రామన్ సభ్యుడిగా చేరడంతో ఆ సంస్థ అనతికాలంలోనే గొప్ప పరిశోధన కేంద్రంగా మారింది. మహేంద్ర లాల్ సర్కార్ రామన్‌కు నిరాటంకంగా స్వతంత్రంగా ప్రయోగాలు చేయడానికి ఆ సంస్థలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాడు. 1915లో ఆశుతోష్ ముఖర్జీ సహాయంతో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు.
1928 ఫిబ్రవరి 28న కాంతి ప్రసరణను వివరిస్తూ ‘రామన్ ఎఫెక్టు’ను ప్రకటించారు. ఈ పరిశోధన విజ్ఞాన శాస్త్ర రంగంలో అత్యంత కీలకమైనది. పారదర్శకంగా వున్న ఘన, ద్రవ, వాయు మాధ్యమాల ద్వారా కాంతి ప్రసారం అయినపుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని తెలియజేశాడు. రామన్ ఎఫెక్టు పరిశోధనను ఉపయోగించి కొన్ని వందల స్ఫటికాల, వాయువుల, రసాయనిక సంయోగికాల అణు నిర్మాణాలను తెలుసుకోవడానికి వీలు కలిగింది. కాంతి, దృష్టి, రంగు, క్రిస్టల్స్, వజ్రాలు మొదలైన వాటిపై ఎన్నో అమూల్య విషయాలను రామన్ ఎఫెక్టు వివరించింది. రామన్ పరిశోధనలు ఫొటోగ్రఫీ, రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రామన్ ఎఫెక్టు ఆవిష్కరణకుగాను 1930లో సి.వి.రామన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు, తొలి ఆసియన్ శాస్తవ్రేత్త ఆయనే. రామన్ ప్రతిభను గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. రాయల్ సొసైటీ ఫెలోషిప్‌తో సత్కరించి నైట్‌హుడ్ బిరుదును కూడా ప్రదానం చేసింది. 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన ‘్భరతరత్న’తో సత్కరించింది. రామన్ ఎఫెక్టు పరిశోధనను ఆవిష్కరించిన ఫిబ్రవరి 28వ తేదీని భారత ప్రభుత్వం ఏటా ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా నిర్వహిస్తున్నది.
రామన్ స్థాపించిన రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో హోమీ జె. బాబా, విక్రమ్ సారాభాయ్, కె.ఎన్.కృష్ణన్ లాంటి ఎందరో అగ్రగణ్యులు అధ్యయనం చేశారు. నిత్య సాధకులైనవారే తన వారసులని రామన్ చెప్పేవారు. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలలోని పరికరాలతో వికసించదని, శాస్తవ్రేత్తల పరిశోధనలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని గట్టిగా విశ్వసించిన మహాజ్ఞాని సి.వి.రామన్. విజ్ఞాన ప్రపంచపు వినువీధిలో భారత వైజ్ఞానిక కీర్తి పతాకం ఎగరేసిన ఘనత ఆయనదే. నిరంతరం పరిశ్రమ, స్వతంత్ర ఆలోచనా ప్రవృత్తిగల రామన్ నిగర్వి, నిరాడంబరుడు, చక్కటి సంభాషణ చతురుడు, మిక్కిలి సంగీత ప్రియుడు. 1970 నవంబర్ 21న సి.వి.రామన్ భౌతికంగా ఈ లోకాన్ని వీడినప్పటికీ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఆయన ఎప్పటికీ ధృవతారలా వెలుగొందుతూనే ఉంటాడు. జీవితాంతం విజ్ఞాన శాస్త్రానే్న తన మతంగా స్వీకరించి, భౌతిక తత్త్వానే్వషణకే జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి ఆయన. ఆయన జీవిత చరిత్ర వైజ్ఞానిక కృషిని ఏ తరం శాస్తవ్రేత్తకైనా, ఏ తరం విద్యార్థికైనా సదా ఆదర్శప్రాయమే.
*
నేడు సీవీ రామన్ జయంతి

-కందుకూరి భాస్కర్ 97034 87088