Others

ఇంట్లోనే హెయిర్ స్పా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. వేడుకకు ఎంత అందంగా తయారైనా.. జుట్టు నిర్జీవంగా ఉంటే అందం నీరుగారిపోతుంది. అందుకే ముందుగా జుట్టును జీవంగా, అందంగా, ఎలా చెబితే అలా వినేట్లు చేసుకోవాలి. అలాగని బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాలంటే సమయం, డబ్బూ రెండింటినీ ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇంట్లోంచి కదలకుండా, ఇంట్లోనే చేసుకోదగ్గ చిట్కాలతో అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునే ఈ హెయిర్ స్పా చికిత్సలో ఐదు దశలు ఉంటాయి.
మర్దన
ఆవిరిపట్టడం
తలస్నానం
కండీషనింగ్
హెయిర్ ప్యాక్
* మర్దన: ముందుగా కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనెలను సమపాళ్ళలో తీసుకుని గోరువెచ్చగా వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మునివేళ్ళతో తీసుకుని కుదుళ్ళకు బాగా పట్టించి పదిహేను నుంచి ఇరవై నిముషాలపాటు మర్దన చేయాలి.
* ఆవిరి: వేడినీళ్ళలో ఒక టవల్‌ను ముంచి నీళ్ళు కారకుండా పిండేయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ టవల్‌ను జుట్టంతా మూసి ఉండేలా తలకు చుట్టుకుని పది నిముషాల పాటు ఉండాలి. ఇలా చేయడం వల్ల అంతకు ముందు పట్టించిన ఆయిల్ మిశ్రమం జుట్టు కుదుళ్ళలో బాగా ఇంకుతుంది.
* స్నానం: ఆవిరి పట్టిన తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూను గానీ, కుంకుడుకాయగానీ, శీకాయను గానీ ఉపయోగించి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నూనె పట్టించి స్టీమ్ ఇచ్చిన జుట్టును రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం కూడా తలస్నానం చేయవచ్చు.
* కండీషనింగ్: కుంకుడు కాయతో, శీకాకాయతో తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్‌ను అప్లై చేసి ఐదు నిముషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే కండీషనర్ వాడటం ఇష్టం లేనప్పుడు రెండు కప్పుల నీళ్ళలో ఒక చెంచా టీ ఆకులు వేసి మరిగించి దానిలో రెండు చెంచాల నిమ్మరసం పిండుకుని కండీషనర్‌గా ఉపయోగించవచ్చు.
* హెయిర్ ప్యాక్: ఇక హెయిర్ స్పాలో ఆఖరి దశ జుట్టుకు ప్యాక్ వెయ్యడం, జుట్టు తత్త్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. పొడారిపోయినట్లుండే జుట్టు కలవారు గుడ్డు పచ్చసొన, జిడ్డు జుట్టు ఉన్నవారు గుడ్డు తెల్లసొన, నార్మల్ హెయిర్ ఉన్నవారు గుడ్డు మొత్తంగా తీసుకుని, దీనిలో కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి బాగా గిలక్కొట్టి తలకు పట్టించాలి. తరువాత వేడినీటిలో ముంచిన టవల్‌ను పిండి తలకు చుట్టుకోవాలి. ఇరవై నిముషాల తరువాత షాంపూ లేదా కుంకుడుకాయ లేదా శీకాయలతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నెల రోజుల పాటు చేసి ఆ తరువాత క్రమంగా అవసరాన్ని బట్టి నెలకు ఒకటి లేదా రెండు సార్లు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా అందంగా, నిగనిగలాడుతుంది.