Others

‘సహకార సేద్యం’తో సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ సహకార వ్యవస్థ వైపు దృష్టి సారిస్తున్నాయి. మన దేశంలో నేటికీ 48 శాతంతో అతి పెద్ద పరిశ్రమగా వ్యవసాయ రంగం రాణిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో గ్రామీణుల జనాభా 80 శాతం, పట్టణ ప్రజల జనాభా 20 శాతం వుండగా, మొత్తం జనాభాలో 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కాలక్రమేణా అటు ప్రపంచీకరణ, ఇటు పట్టణీకరణ పెరిగిపోవడం, సాంకేతికంగా పలురకాల మార్పులు రావడంతో వ్యవసాయం కుంటుపడుతూ వస్తున్నది. ఇదే సందర్భంలో వ్యవసాయరంగంలో కూడా పెనుమార్పులు సంభవించాయి. ఎప్పుడైతే వ్యవసాయం కుంటుపడుతున్నదో అన్ని రకాల సమస్యలకు తగ్గుతున్న ఆహార ఉత్పత్తుల సమస్య కారణమవుతున్నది.
ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తులలో భాగంగా అన్నిరకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు, కొబ్బరినీరు వంటివాటిలో కల్తీ చోటుచేసుకుంటున్నది. అన్నిట్లో రసాయన పదార్థాలు మిళితమైపోతున్నాయి. చివరకు పీల్చే గాలి, తాగే నీరు కూడా కలుషితమైపోతున్నాయి. ఇప్పుడు మళ్లీ యావత్ ప్రపంచం గ్రామీణ వ్యవస్థను పునరుజ్జీవింపచేయడానికి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాలనే తపనతో ముందుకు పోతున్నది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో అనేక సభ్యదేశాల ప్రతినిధులు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని, సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులలో భాగంగా మన దేశంలో నూతన సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడంలో ఇంకా ఎంతో వెనుకబడి వున్నాము. రసాయనిక ఎరువులకన్నా ఆవులు, గొర్రెలు, బర్రెల ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు పంటలకు ఏమాత్రం హానికరం లేకుండా ఉపయోగపడుతుంది. గేదెలను, ఆవులను పోషించడానికి, మేపడానికి రైతులకు, గ్రామీణులకు చాలా భారంతో కూడిన ఖర్చు అవుతున్నది. వ్యవసాయ రంగానికి కూలీల సమస్య కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రధాన ఆయువుపట్టు అయిన సాగునీరు కూడా కొన్ని ప్రాంతాల్లో సమతుల్యతలో భాగంగా లభించడం లేదు. ఇంకా అనేక ప్రాంతాలలో వర్షాధార పంటలమీదనే రైతులు ఆధారపడ్డారు. వాన రాకడ, మనిషి పోకడ తెలయదు అన్నట్లుగా సకాలంలో వర్షాలు లేక రైతులు అనేక సందర్భాలలో నష్టపోతున్నారు. ఇంతా చేసి కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు పల్లెలు వదలి పట్టణాలకు వలసబాట పట్టి.. అక్కడ చిరు వ్యాపారులుగానో, చిన్నపాటి ఉద్యోగులుగానో జీవనయానాన్ని బలవంతంగా సాగిస్తున్నారు. ఈ పట్టణీకరణ మాయ, మారుతున్న యాంత్రీకరణ వ్యవస్థలో భాగంగా గ్రామాలలో ఒకరికొకరు తోడ్పాటునందించుకునే పరస్పర వ్యవసాయ సహకార పద్ధతి కనరుమగరువుతున్నది.
అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో ఒక వ్యక్తి వెయ్యి ఆవులను మైదాన ప్రాంతాలలో మేపుతున్నాడు. ఆవులు మైదానంలో పచ్చిక మేస్తుంటాయి, పైన ఆవుల యజమాని హెలికాప్టర్ ద్వారా తిరుగుతూ అవి క్రమశిక్షణ తప్పకుండా, దూరంగా వెళ్లిపోకుండా సైరన్‌తో కంట్రోల్ చేస్తాడు. అక్కడ విశాల పచ్చిక భూములు వున్నాయి. ఇందుకు కారణం అక్కడ జనానా తక్కువ, భూభాగం ఎక్కువ. చైనాలో మన కన్నా అత్యధిక జనాభా వుంది. అక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలు అమలులో వున్నందున పట్టణాలలో పరిశ్రమలతోపాటు గ్రామాలలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ విభాగాలు, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్నాయి. పంట ఉత్పత్తులు రైతులే అమ్ముకునే విధంగా అక్కడి పాలకులు వారిని మానసికంగా చైతన్యవంతులను చేశారు. మొత్తం మీద చైనా పాలకులలో పారదర్శకత వుంది. ప్రజల్లో జవాబుదారీతనం ఏర్పడింది. ఒకప్పుడు పాకిస్తాన్‌లో వుండి అనేక కష్టనష్టాలను అనుభవించి 1971లో ప్రత్యేక దేశం కింద ఆవిర్భవించిన బంగ్లాదేశ్ రెండు దశాబ్దాల కాలంలోనే సహకార వ్యవస్థ ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరింది. పాపాల పాకిస్తాన్ ఇంకా వెనుకబడిన దేశం కిందనే కునారిల్లుతున్నది. ఇలాగే రాజరికపు దర్పం నుంచి ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చిన నేపాల్ కూడా ఇప్పుడు సహకార రంగం ద్వారా చాలా మెరుగైన పద్ధతిలో దూసుకుపోతున్నది. ఇజ్రాయిల్ వంటి ఎడారి దేశాలలో కూడా వ్యవసాయం కొత్త పద్ధతిలో లాభదాయకంగా మారింది. అక్కడి ప్రజలు డాబాలమీద మన్ను రెండు మూడుగు అడుగులు పోసి దాన్ని భూమిగా పరిగణించి పంటలు పండిస్తున్నారు. ఇసుక భూముల్లో కూడా తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు.
ఇప్పుడు మన దేశంలో కూడా సహకార సేద్యం అమల్లోకి వస్తే అప్పుడు రైతులలో జవాబుదారీతనం ఏర్పడుతుంది. దళారీల వ్యవస్థ దూరమవుతుంది. తమ ఉత్పత్తులకు తామే వ్యాపారులుగా మారుతారు. అంతరించిపోతున్న గ్రామీణ వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవింపచేయడానికి మిణుకుమిణుకుమంటున్న సహకార వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడానికి వ్యవసాయం నుంచి చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు కార్పొరేట్ శక్తుల మీద ఆధారపడకుండా అన్నిచోట్ల ప్రజలను భాగస్వాములను చేసే విధంగా సహకార వ్యవస్థను సరికొత్త రూపంలో పయనింపజేయడానికి ప్రధాని మోదీ సంకల్పించారు. ఈ నేపత్యంలో నవంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాలు ఈనెల 14న ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాలనుంచి ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు భాగస్వామ్యం కల్పించారు. ఈ వారోత్సవాలలో సహకార రంగం అభివృద్ధి, వ్యవసాయ రంగం ప్రాధాన్యత, రాయితీల గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ప్రణాళికలను విడుదల చేస్తారు.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212