సబ్ ఫీచర్

శిరోభారం తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలనొప్పిగా ఉందంటే చాలు.. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి ఏదో ఒక మాత్ర కొనుక్కుని మింగేస్తారు. మామూలు తలనొప్పికి తరచూ మాత్రలు వేసుకుంటే అప్పటికప్పుడు కాస్త ఉపశమనం లభించినా, భవిష్యత్‌లో ఆరోగ్యపరంగా విపరిణామాలు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ఏదోఒక మాత్ర వేసుకునే బదులు ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే తలనొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంది. శిరోభారం ఎదురైనపుడు కాస్త అల్లం తింటే తలభాగంలోని రక్తనాళాలు సేదతీరుతాయి. అల్లం రసంలో కాసిన్ని నిమ్మచుక్కలు వేసుకుని రోజుకు రెండుసార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది. మరగబెట్టిన నీటిలో అల్లం పొడి వేసి ఆవిరి పీల్చినా ఉపశమనం కలుగుతుంది. దాల్చినచెక్కను నీటిలో అరగదీసి ముద్దలా చేసి నుదుటి భాగానికి రాసుకుని అరగంటసేపు పడుకుంటే తలనొప్పి మాయమవుతుంది. లవంగాల పొడిని పరిశుభ్రమైన చేతి రుమాలుపై వేసి కొంతసేపువాసన పీలిస్తే శిరోభారం తగ్గుముఖం పడుతుంది. చామంతి ఆకులతో ‘టీ’ చేసుకుని తాగితే తలనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ టీలో రుచి కోసం కాస్త తేనె కలుపుకోవచ్చు.