Others

ఎక్కడా.. తగ్గడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ ఎక్కడా తగ్గడం లేదు. వయసు అతని వేషాల ముందు వెలవెలబోతోంది. కుర్ర హీరోలను చాలెంజ్ చేస్తూ.. ‘రూలర్’ మేకోవర్‌తో హల్‌చల్ చేస్తున్నాడు. ఆమధ్య ఫ్రెంచ్ కట్ షేప్‌లో హెలీకాఫ్టర్ నుంచి దిగుతూ స్టైలిష్ మేకోవర్ లుక్కిచ్చిన బాలయ్య -ఇప్పుడు మరింత టీనేజ్ ఎక్స్‌ప్రెషన్‌తో మరో లుక్ బయటకు వదిలాడు. జీన్స్, ఫ్లవర్స్ డిజైన్డ్ షర్ట్‌తో నిలువెత్తు కటౌట్ స్టిల్‌గా బయటకు వచ్చిన ఈ స్టిల్‌పైనే -త్వరలోనే టీజర్ విడుదల చేస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది. గత చిత్రాలకంటే -రూలర్ కాస్ట్యూమ్స్, అప్పియరెన్స్ అదిరిపోయిందంటూ నందమూరి అభిమానులు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తుంటే.. బాలయ్య పోజులపై అల్లరి అభిమానులు మీమ్స్ వదలుతున్నారు. ప్రస్తుతం రూలర్ షూటింగ్ కేరళలో జరుగుతోంది. బాలకృష్ణ, వేదికలపై పాట చిత్రకరణ జరుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలపై అంచనాలు తలకిందులయ్యాయి. దాంతో సంక్రాంతి రేసులో ఉండాలన్న సెంటిమెంట్‌ను కాస్త పక్కనపెట్టి -డిసెంబర్ 20నే రూలర్‌ను థియేటర్లకు తెస్తోన్న విషయం తెలిసిందే.