Others

వస్తాడు నారాజు ఈరోజు.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విప్లవవీరుని కథ అల్లూరి సీతారామరాజు. 1974లో విడుదలై సంచలన విజయం సాధించింది. భారత ప్రజలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలవైపు నడిపించిన ఆయన త్యాగం మరువలేనిది. ఆయన ప్రేయసి సీత అతన్ని వివాహమాడాలని ఎదురుచూసింది. రామరాజు దేశ యాత్రలో వున్నాడు. రాబోయే పౌర్ణమికి వస్తాడన్న అతని మాటనే వేదంగా భావించి ఆయన కోసం ఎదురుచూస్తోంది. సినారె చక్కని పదాలతో రాస్తే ఆదినారాయణరావు అందమైన బాణీతో పి సుశీల గాత్రంలో అద్భుతంగా పలికించారు. కార్తీక పున్నమి వేళలోన కలికివెనె్నల కెరటాలపైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు -అంటూ వెనె్నలను స్వాగతించినట్లుగా తన ప్రియుడిని ఆహ్వానిస్తుంది.
ప్రకృతి సోయగాలు, మేఘమాలికలు దేహాలు వేరైనా ఆత్మలు ఒక్కటేనన్న భావన ఈ పాటలో అద్భుతంగా వినిపిస్తాయి. అతని ఊసులే ఆమె అంతరంగం. పాలకడలిలా స్పందించే హృదయం. ఎదురుగా లేకున్నా ఉన్నట్లు ఊహిచుకునే కావ్య నాయిక ఆమె. వేల తారకల నయనాలతో నీలాకాశం పిలుస్తోంది. అతని అడుగుల సవ్వడి వీచే గాలి కూడా వినిపిస్తోంది. అతని పాదధూళికోసం ఆమె శరీరంలో అణువణువు కలవరిస్తోంది. ఈ భావన ఓ మహోన్నతమైన త్యాగమయి, ప్రేమమయి అని సీత మనసులోని పవిత్ర భావనలు. ఆమె అంతరంగం పాలకడలిలా పరవశించింది. వెనె్నలకోసం వేచే చకోర పక్షిలా ఎదురుచూసింది. వెనె్నల చంద్రుణ్ణి విడిచిపోనట్లుగానే ఆమె అతన్ని విడిచి ఉండలేదు. కెరటాలు పొంగినా కడలిని దాటిపోలేదు. కలసిన ఆత్మలు ఎప్పుడైనా అనుబంధంతోనే పెనవేసుకునే వుంటాయి. ఏ జన్మకు అవి విడిపోవు అంటూ సీత అంతరంగాన్ని సినారె వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఆ పాటకు తన గాత్రంతో ప్రాణం పోసిన సుశీల జన్మ ధన్యం. అందుకే ఈ పాట అంటే చాలా ఇష్టం.

-లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి