Others

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

61 శ్లోకం
ఉల్క శ్యాన్ నిర్గత జ్వాలా భూతిర్భసితభస్మనీ
క్షారో రక్షా చ దావస్తు దావో వనహుతాశనః
ఉల్క= ఆకాశం నంచి పడే నక్షత్రాలు, శ్యాన్= ఎండిన ; నిర్గత జ్వాల= మంటలు కనుమరుగై ఎండి విభూతిగా మార్పు చెందినది; భూతి= పవిత్రమైన బూడిద,; భసిత= పవిత్రమైన బూడిద; భస్మం = పవిత్రమైన బూడి, ఈ 5 విభూతి యొక్కవివిధమైన పేర్లు; దావః = దవః= అడవి మంటలు; వనహుతాశన = వన+ హుతాశన= అడవి +వేడి మంటలు వ్యాపింప చేసేవాడు కార్చిచ్చు;

62, 63 శ్లోకములు
ధర్మరాజః పితృపతిః సమవర్తి పరేత్రాట్
కృతాన్తో యమునా భ్రాతా శమనో
యమరాండ్ యమః
కాలో దండధరః శ్రాద్ధదేవో వైవస్వతోంతకః
రాక్షసః కోణపః క్రవ్యాత్ క్రవ్యాదోస్రప ఆశరః
ధర్మరాజః= ధర్మానికి రాజు, దక్షిణ దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. యమధర్మరాజు ; పితృపతి= పితృ+ పతి= పితృదేవతలు=అధిపతి,= యముడు, సమవర్తి= న్యాయ, అన్యాయములను సమానదృష్టితో చూసేవాడు. యముడ, పరేత్రాట్ - పరేత్ +రాట్ = మరణించినవారు+రథసారథి= మరణించినవారిని తీసుకొని వెళ్లే రథం యొక్క సారథి, యముడు; కృతాంత= మరణం కలిగించేవాడు, యముడు, యమునా భ్రాతా= యమున+ భ్రాతా= యమున యొక్క సోదరుడు, (సూర్యుడు (వివస్వాన్0 మరియు సంధ్య (విశ్వకర్మ పుత్రిక) పుత్రుడు యముడు అని విష్ణు పురాణంలో ఋగేద్వం లో మార్కండేయ పురాణంలో చెప్పబడింది) యమున వేదములలో యామిగా పిలవబడుతోంది. యముని యొక్క చెల్లెలు యమున సోదరుడు శ్రద్దాదేవ మను (వైవస్వత మనువు ప్రస్తుత మనువు) శని యొక్క సవితి సోదరుడు, యమున నదీ రూపంలో ప్రవహిస్తుంది. ఆమె పురాణాల్లో కాళింది నదిగా పిలవబడింది. శమన= మరణం యొక్క రాజు, యమః= యమరాట్ - యమధర్మరాజు ; యమ= యమ, యమధర్మరాజు కవలలు, జోవరాష్ట్రేయనిసం అనే మతమునకు సంబంధించిన పుస్తకం జెంద్ అవేస్తాలో యముని యామిగా పేర్కొంటారు. కాలః = యముని కాలం తో వ్యవహరిస్తారు. దండధరః= దండ ఙధరః= దండం + పట్టుకున్నవాడు యముడు, సూర్యుని భార్య సంధ్య సూర్యుని వేడి భరించలేక పోవుట చేత విశ్వకర్మ సూర్యుని వేడి తగ్గించి, మిగిలిన సూర్యుని ధూలితో యమునికి దండం, విష్ణువునకు సుదర్శన చక్రం, శివునికి త్రిశూలం , కుబేరునికి పల్లకి, సుబ్రహ్మణ్యునికి శక్తి, దేవతలకు మరికొన్ని ఆయుధములు తయారు చేసి ఇచ్చాడు. శ్రాద్దదేవ= శ్రాద్ద + దేవ=శ్రాద్దములు + దేవః= శ్రాద్దములు తీసుకునే దేవుడు, యముడు; వైవస్వతః = వైవస్వత మనువు యొక్క బంధువు, సోదరుడు, యముడు, తక= మరణము యముడు ; రాక్షస= రాత్రి సంచరించేవాడు, యముడు, కోణపః= కౌణపః = మరణించిన వారిని అని కోణముల నుంచి కాపాలా కాసేవాడు, యముడు క్రావ్యాట్ = క్రావ్యదాః మృత్యుజ్వాల , యముడు, అశ్రప = ఆశరః = రాక్షసుడు (మానవులు యముని రాక్షసుని వలె భావిస్తారు. )
64 శ్లోకం
రాత్రిఞ్జరో రాత్రిచరః కర్భూరో నికశాత్మజః
యాతుధానః పుణ్య జనో నైరుతో యాతు రక్షసీ

రాత్రిఞ్జర = రాక్షసుడు,; రాత్రిచరః= రాత్రి సంచరించేవారు; కర్బూరః= రాక్షసుడు, నికషాత్మజ= రాక్షసుడు, యాతుధానః = రాక్షసుడు; పుణ్యజనః= మంచి రాక్షసుడు, నైరుతః= పశ్చిమ దిక్కు అధిపతి, రాక్షసుడు ; యాతు = రాక్షసుడు ! రాక్షసి= రాక్షసులు; ఇవి అన్నీ రాక్షసుల పేర్లు.

ఇంకా ఉంది

తీగవరపు వనజ 7382762152