Others

శుభంకర! సురేశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృడ ! సదాశివ! భగవంత మేరుచాప
గిరిశ! చారువిక్రమ! శుభంకర సురేశ!
దేవ! దక్షాధ్వర ధ్వంస! దీనబంధు!
కొన్ని నిముషాలు దివ్వెన్నై కొలుతునిన్ను!

నిన్ను కొల్చిన క్షణమదే నిఖిల జయము
నిన్ను పిల్చిన నోటిదే నిజపథమ్ము
నిన్ను తల్చిన మనసుదే నిత్యశాంతి
కార్తీకమున దీపము జూడ కనుల పంట

శివశివాయన్న చితలు చేరుగుహలు
హరహరాయన్న కష్టాలు గిరులు కరుగు
భవభవాయన్న బాధలు పరుగుతీయు
కార్తీకపు కౌముదీ దీప కాంతి జూడ

శంకరాయని సతతమ్ము సంస్తుతింతు
శ్రీహరాయని నిత్యము సేవజేతు
స్మరహరాయని భక్తితో స్మరణ జేతు
దివ్యకార్తీక దీప సందీప్తియందు

కన్నుల చూపుల విడదీయగలమె? లిఖిత
కాగితము నుండి అక్షరాల్ లాగగలమె
రవిని కిరణాల నుండి వేర్పచగలమె?
కార్తీకము నుండి నిను శివా !
కదపగలమె!
శ్రవణ కీర్తన స్మరణయొ చరణసేవ
అర్చనము వందనమ్ము దాస్యమును సంఖ్య
మాత్మ యొక్క నివేదన లందు - ఒక్క
మార్గమున నైన నడిచిన స్వర్గమగును

- కడియాల మధుసూదన రావు 9030907191