Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేల లోంచి బ్రద్దలై కమ్ముకునే సృష్టి శక్తిని నేను
అనువాదం కాని బ్రతుకును అందుకునే ‘వ్యక్తి’ని...
ఆంతర రసాహుత్యాకృతిని
బెట్టుచేసినప్పటి తొలి వేకువలో
నేను మృత్తికామరంద శిశుబీజాన్ని
ఆత్మపదార్థ నైచకీ దోహనశీలమైన మట్టి
నాకిచ్చిన వేకువలో నేను
జాగృతమైన పరిమళ రసోజాన్ని
చిత్రం... నేనెక్కడున్నానని వెతుకుతుందీ లోకం...
ఏకాక్షర నిఘంటువులోని ఏకైకకాక్షరంలో
కృథిత భావవాహినీ సంగత కవితా రూప తపస్సునై
హృషీకరాశిలో దవశిఖరేగగా తరచి తరచి
రేకు కన్నులు మూసుకున్న
సుమదీపికా విదృతాత్మ సుధారజస్సునై
నేను అంతటా వున్నాను
రాగమాత్రంగా అణుగాత్రంగా
తామసఖండాల అంతరాళ మహోద్విగ్నంలో
నీలిరంగుల స్వప్నవీధుల్లో
పదభేరికానాద ప్రకంపనాద్యంలో
మర్మభూముల్లోని మూలధాతువుల్లో
మానవతా లహరి దారి కోల్పోనని ప్రవాహంలో
తొలినాటి స్వరూప జగత్తులో
చేతన జారని అంతస్సూత్రంగా
- అంతటా వున్నాను
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404