Others

నీలోన ననే్న.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్టీ రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ రూపొందించిన గుడిగంటలు చిత్రంలో ‘నీలోన ననే్న నిలిపేవు నేడే/ ఏ శిల్పి కల్పనవో.. ఏ కవి భావనవో’ పాట నాకు చాలా ఇష్టం. విక్టరీ మధుసూదన రావు దర్శకత్వంలో సుందర్‌లాల్ నహతా, డూండీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఈ పాట ఓ అద్భుతం. దాశరథి పదాలకు ఘంటసాల వారి స్వీయ బాణీలో అద్భుతంగా ఆలపించారు. ఈ పాటను యన్టీఆర్, కృష్ణకుమారిపై చిత్రీకరించారు. కథానాయిక అందాన్ని వర్ణిస్తూ నాయకుడు ఈ పాటను పాడతాడు. ముఖ్యంగా చరణాల్లో -ఎల్లోరా గుహల్లో పిల్లవుంది నీలో/ నండూరివారి ఎంకివుంది నీలో/ అల విశ్వనాథ చెలి కినె్నరుంది/ మా బాపిరాజు శశికళవుంది అంటూ పాడే సన్నివేశాల్లో కృష్ణకుమారి ఆయా రూపాల్లో కనిపించి కనువిందు చేస్తుంది. ఖయ్యూము కొలిచే సాకీవి నీవే/ కవి కాళిదాసు శకుంతల నీవే/ తొలిప్రేమ దీపం వెలిగించినావె/ తొలి పూల బాణం వేసింది నీవే.. అన్న చరణంలో కృష్ణకుమారి శకుంతలగా కనిపిస్తుంది. బహుశ కృష్ణకుమారి ఏ చిత్రంలో కూడా శకుంతల పాత్ర వేయలేదు. అందుకే శకుంతల పాత్రలో కృష్ణకుమారిని చూస్తే ఈ పాట గుర్తుకొస్తుంది. కథానాయకుడు చిత్రాలను గీస్తూ పాడే ఈ పాట సందర్భానికి తగినట్టుగా ఉంటుంది. ఎల్లోరా గృహల్లో పిల్లగా, ఎంకిగా, కినె్నరసానిగా, శశికళగా, శకుంతలగా ఆయా పాత్రల్ని నాయకుడు ఊహించుకుంటూ పాట పాడటం ప్రేక్షకులకు ఎంతో హాయైన అనుభూతినిస్తుంది. అలా చిత్రీకరించిన దర్శకుని ప్రతిభ కూడా అద్భుతం. నండూరివారిని, విశ్వనాథవారిని, బాపిరాజును, కవి కాళిదాసును ప్రస్తావిస్తూ కవి దాశరథి ఈ పాట రాయటం సాహిత్యాభిమానులకు ఆనందం కలిగించే విషయం. సంగీత పరిజ్ఞానం లేనివారు సైతం పాడుకునే రీతిన ఘంటసాలవారు బాణీ కట్టారు. రాగం మాత్రమే ఆలపిస్తూ పరవశం చెందే కథానాయిక కనిపిస్తుంది.
-పి చిన్నకోటయ్య, అద్దంకి