AADIVAVRAM - Others

వెలుగులు విరియాలని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడతలు తొండలు పావురాళ్లు పిచ్చుకలు
కుందేళ్లు ఓ చోట చేరి-
పొలాల్లోంచి పొదల్లోంచి
చెట్లకొమ్మల్లోంచి బీళ్లలోంచి జతకట్టి-
అవసరాల అడవులు నశించిపోతుంటే
మనుగడ కష్టమని
అల్పప్రాణులైనా ఆరాటపడి-
గుంపై; పటాలమై-
పళ్లనో గోళ్లనో ఆయుధాలుగా మల్చుకొని-
దిగాయి; వెనక్కి వెళ్లమని
దిగాయి
సందుల్లోకి దూరమని; గోడదూకి పారిపోమని
శపథం చేసి-
నడిరాత్రైనా
జడివానైనా వెరవమని-
లాటీలకి టియర్ గ్యాస్‌కి
స్పృహ కోల్పోవడమో మూర్ఛబోవడమో
చివరగా చనిపోవడమో ఇక్కడేనని-
పట్టుమీద ఒకటే నినాదాలు
జట్టు మీద ఒకటే నిరసన ప్రదర్శనలు
జడ పదార్థం జీవచైతన్యంగా కదిలిన గొప్ప దృశ్యం-
గడ్డకట్టిన దుఃఖంతోను ఆత్మాభిమానం విలవిలలోను
తీవ్ర ప్రతిఘటనం-
దేవుడా!
వ్యతిరేకత వ్యక్తమైన చోటే
సయోధ్య కుదరనీ
చర్చలు జరగనీ
గుణాత్మక మార్పుతో ధగధగల
వెలుగులు విరియని-

-కోటం చంద్రశేఖర్ 9492043348