వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అర్థరహితమైనట్టి యరుపులేల?
వ్యర్థ వాదాలకిమ్మహి వణుకుటేల?
కోపతాపాల బరువెక్కు గుండెలేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: చాలా కుటుంబాలలో విచక్షణారహితంగా అర్థరాహిత్యాలైన అరుపులతో మనస్తాపం చెందుతూ మనస్తాపాన్ని కలిగిస్తున్నారెందుకో. వ్యర్థ మాటలతో ఈ భూమండలం వణకడం దేనికి? కోపతాపాలతో బరువెక్కి పోయిన గుండెలతో కడదాకాబ్రతికే ఆబ్రతుకులు బ్రతుకలే కావని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోదించవయ్యా స్వామీ.

తే.గీ. మెతుకలో రైతు కష్టంబువెతుకవలయు
మెతుకువిలువను ఁ గనుగొని మెలగవలయు
మెతుకునకు నేడ్చువారికో మెతుకు రాల్చి
పుణ్యఫలరాశులెన్నియో పొందవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మనం తినే అన్నంలోని ప్రతి మెతుకులో ఆ రైతు కష్టాన్ని వెతికి మరీ గ్రహించాలి. అలాగే అన్నం మెతుకు విలువను గుర్తించి నడుచుకోవాలి. మెతుకు కోసం ఏడ్చే నిర్భాగ్యులకు ఓ మెతుకు విదల్చి పుణ్యఫలరాశులను పొందాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామి!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262