వినమరుగైన

వ్యాసాలతోనే మానవత్వ జాగృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుని నిత్య చైతన్యం చేసేది సాహిత్యం. మంచి ఆలోచనలతో సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపే అద్భుత శక్తి సాహిత్యానికి వున్నది. అక్షరం నుంచి సాహిత్యం వస్తుంది. అక్షరం సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. సకల వాఙ్మయం ఈశ్వరుని ఢమరుకం నుంచి ఆవిర్భవించినదే. ‘శీతే జగదస్మిస్నితి శివః’ అనగా శివుడే సర్వ జగత్తునకు అధిష్టాన దేవత.
ముదిగొండ చంద్రశేఖర్ గారు శ్రీ శైవ మహాపీఠానికి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ శైవ మత ప్రబోధిని మాస పత్రిక ప్రధాన సంపాదకులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వయస్సు 70 సంవత్సరములకు పైబడినా వయోభారాన్ని లెక్కచేయక దాదాపు 20 సంవత్సరాలుగా శైవ మత ప్రబోధిని నిరాఘాటంగా వీరి ఆధ్వర్యంలో ప్రచురించబడటం ఆషామాషీ కాదు.
ఈ కార్యానికి ఎంతో ఓర్పు, సహనం, సమయపాలన, పాలనాదక్షత అవసరం. ఇలాంటి లక్షణాలు వారికి పుష్కలంగా వుండడమే కాకుండా ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా వున్నాయి. అందువల్ల నిరాఘాటంగా తమ పనిని నిర్వర్తిస్తున్న కర్మయోగి.
ఈ గ్రంథంలో దాదాపు 58 సంపాదకీయాలు మరియు 11 అవలోకనములు ఉన్నవి. ఈ సంపాదకీయములన్నియు దైవ సంబంధమైన విషయములతోపాటు ప్రజా సాంస్కృతిక జీవనములలోని అన్ని పార్శ్వములను స్పృశించుతూ వ్రాసినవి శివసంబంధితమైన తత్వములు సవిస్తరంగా బోధించబడినవి. అవలోకనములలో భారతీయ తత్వము నేటి జీవన వ్యవస్థ, మహిళా చైతన్యం అవసరము. బీటలువారుతున్న భారతీయ తత్వం హారతి కర్పూరం అవుతున్న ఆలయాల ఆస్తులు, వృద్ధాప్యాన్ని శాపం కానీయకుండా చూసుకోవలసిన జాగ్రత్తలు.. ఆలోచించండి అంటూ పాఠకుల్ని జాగృతం చేశారు
కారణజన్ముడు శివానందమూర్తిగారి గురించి, వేదం హిందూ ధర్మాలకు మూలం, శివుడే శివానందుడు, శివద్వేషం శిక్షార్హం అంటూ సోదాహరణంగా విపులీకరించారు. మహిళామణుల మణిహారం శ్రావణమాసం. అందరి ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు. కార్తీకదీప ప్రజ్వలనం జ్ఞానపీఠ కారకం. సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణీ అంటూ అపర శంకరులు శంకరారాధ్యులు వారి బోధనలే మనకు శరణ్యం అంటూ వివరించారు. నవనవోనే్మషం ఇప్పటి నయా కాశ్మీరం. వెల్లువెత్తిన జనచైతన్యంతో సయోధ్య దిశగా అయోధ్య మారుతుంది అని ఆశావాదాన్ని వెలిబుచ్చారు. నేను ఈ పీఠిక వ్రాస్తున్న సమయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించడం కాకతాళీయం అయినా శివప్రసాదమైన యాదృచ్ఛికమే.
సాధారణంగా ఈ రోజులలో ఏ పత్రికా సంపాదకులయినా తాము రచించి ముద్రించిన వ్యాసపీఠికలను గ్రంథ రూపంలో తెస్తున్నారు. ఇది ఎంతో ముదావహం. కాని ముదిగొండ చంద్రశేఖర్ గారి సాహిత్య కుసుమాల సంపాదకీయాలు మాత్రం భక్తి, ముక్తి, రక్తికారకమై పాఠకుల మన్ననలను పొందుతాయి అనడంలో ఎటుంవటి సందేహం లేదు. వీరు పూర్వాశ్రమంలో 40 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్ వృత్తి నిర్వహించి ఉత్తమ డాక్ సేవా అవార్డు పొందిన గొప్పవారు. సాహిత్యపరంగా కూడా కథలు, కథానికలు దాదాపు 100కిపైగా వ్యాసాలు, నవలలు, నాటికలు వ్రాశారు.
ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో వంద సంవత్సరాలు జీవించి అటు శివతత్త్వాన్ని ఇటు సాహిత్య సేవను చేసి తాము తరించి కన్నతల్లిదండ్రులను ధన్యులను చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇక ఈ గ్రంథాన్ని తన అర్థాంగి శ్రీమతి ఇందుమతికి అంకితం ఇచ్చి పూర్తి ఉమామహేశ్వరమూర్తిత్వాన్ని ఆపాదించుకొని సార్థకనామధేయులైనారు.

-జొన్నభట్ల నరసింహప్రసాద్