సబ్ ఫీచర్

వంట గ్యాస్ బీమా గురించి తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లో గ్యాస్ సిలిండర్‌తో గానీ, రెగ్యులేటర్‌కు అమర్చిన ట్యూబ్‌తో గానీ ప్రమాదం జరిగి ఆస్తి,ప్రాణనష్టం వాటిల్లితే వినియోగదారులకు బీమా వర్తించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, గ్యాస్ కంపెనీలు చెల్లించే ఈ బీమా మొత్తంపై చాలామంది వినియోగదారులకు ఎలాంటి అవగాహన లేదు. వంటింట్లో గ్యాస్ ప్రమాదాలకు బీమా పథకం ఉందన్న విషయం ఎంతోమందికి తెలియదు. సాంకేతిక లోపం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితే అయిదు లక్షల రూపాయల వరకూ సంబంధిత గ్యాస్ కంపెనీ చెల్లిస్తుంది. వినియోగదారుల పేరిట గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే లక్షలాది రూపాయలను బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లిస్తున్నాయి. సుమారు 40 వేల మంది వినియోగదారులున్న గ్యాస్ ఏజెన్సీలు సుమారు 20 లక్షల రూపాయల మేరకు బీమా కంపెనీలకు జమ చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ లేదా ట్యూబ్ వల్ల ప్రాణనష్టం జరిగితే మృతుని కుటుంబానికి సదరు గ్యాస్ కంపెనీ 5 లక్షల రూపాయల వరకూ చెల్లించేలా బీమా పథకం అమలులో ఉంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి వివరాలను సంబంధిత గ్యాస్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ సేకరించి నష్టం ఏ మేరకు జరిగిందో అంచనా వేస్తారు. ప్రమాదంలో కాలిపోయిన ఆస్తులను కూడా అంచనా వేసి బీమా అందజేస్తారు. బీమా పథకానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీల్లో రికార్డులను అధికారులు ఏడాదికోసారి తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
సాంకేతిక లోపాల వల్ల జరిగే ప్రమాదాలకు మాత్రమే బీమా పథకం వర్తిస్తుంది. వినియోగదారుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలకు బీమా చెల్లించరు. గ్యాస్ కంపెనీ సరఫరా చేసిన సిలిండర్, రెగ్యులేటర్, ట్యూబ్‌లో లోపాల వల్ల ప్రమాదం జరిగితే ఆస్తి, ప్రాణనష్టాలకు బీమా వర్తిస్తుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిని ‘ఎల్‌పిజి నామ సంవత్సరం’గా ప్రకటించి, వినియోగదారుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ ఏజెన్సీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని ఇక పూర్తి స్థాయిలో అమలు చేసేలా కసరత్తు జరుగుతోంది. గ్యాస్ లీకేజీ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు 1906 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. రాబోయే మూడేళ్లలో అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బీమా పథకాలపై వినియోగదారుల్లో చైతన్యం పెంచేందుకు గ్యాస్ కంపెనీలు విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.