Others

బొప్పాయితో బోలెడు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో బొప్పాయిది ప్రత్యేక స్థానం. పచ్చి బొప్పాయి కాయలను కూరగా, దోరగా పండిన వాటిని నేరుగా తినొచ్చు. బోలెడన్ని పోషకాలను అందించడంతో పాటు సులభంగా జీర్ణమయ్యే బొప్పాయిని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తినొచ్చు. ఇది సంవత్సరం పొడవునా లభించడమే కాకుండా చాలా చౌక కూడా.
* ప్రతి వంద గ్రాముల బొప్పాయిలో సుమారు అరవై నుంచి వంద మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే బొప్పాయి చక్కని రోగనిరోధక శక్తికి, చర్మం నిగారింపునకు దోహదపడుతుంది.
* బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌గా వేసుకుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు, చర్మవ్యాధులూ దూరమవుతాయి. అంతేకాదు ఇలా తరచూ చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశిస్తుంది.
* బొప్పాయి పండులో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ ఉంటాయి గనుక ఇది చక్కటి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికారక ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని నిరోధిస్తుంది.
* రుతుక్రమ సమస్యలకు బొప్పాయి పండు చక్కని మందు. అంతేకాదు ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పిని బొప్పాయి తొలగిస్తుంది.
* అధిక బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ తింటే సరి. బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాలు తక్కువ కేలరీలను ఉత్పత్తి చేసి లావుగా ఉన్నవారిని సన్నగా చేస్తుంది.
* పరగడుపునే బొప్పాయి తింటే రక్తపోటు అదుపులోకి రావడమే గాక కడుపులో చేరిన నులి పురుగులు తొలగిపోతాయి.
* బొప్పాయి వేరు మూత్రపిండాల్లో రాళ్లు కరిగేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
* మధుమేహ రోగుల్లో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. అందుకే మధుమేహం ఉన్నవారు రోజూ ఒకటి, రెండు బొప్పాయి ముక్కలను తీసుకుంటే రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది.
* రక్తంలో మోతాదుకు మించి కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ బొప్పాయిని తింటే ఎలాంటి మందులూ వాడకుండానే నెలరోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* పలు ఉదర సంబంధిత అనారోగ్యాలకు బొప్పాయి దివ్యమైన ఔషధం. బొప్పాయి గింజలను నూరి ఆ పొడిని తీసుకోవాలి. దీన్ని చెంచాడు నిమ్మరసంతో కలిపి మూడు పూటలా తీసుకుంటే దెబ్బతిన్న కాలేయం పనితీరు మెరుగు పడుతుంది.
* కీళ్ళ వాతం, ఎముకలు బోలుగా మారటం, ఆస్తమా బాధితులు బొప్పాయి తింటే ఆయా సమస్యల కారణంగా వచ్చిన నొప్పులు, వాపులు ఉపశమిస్తాయి.
* బొప్పాయి ఆకులో ఉండే కార్విన్ అనే రసాయనం నొప్పుల నివారిణిగా పనిచేస్తుంది. అందుకే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు బొప్పాయి ఆకులను వేడిచేసి కట్టుకడితే కీళ్ళ నొప్పులు ఉపశమిస్తాయి.
* టాన్సిల్స్, నోటిపూతతో సతమతమయ్యేవారు పచ్చి బొప్పాయి ఆకును నమిలి ఆ రసాన్ని పుక్కిలిస్తే సమస్య తగ్గినట్టే..
* బొప్పాయి పండు క్షయ నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది.
*