Others

మధుమేహం ఉంటే డయాలసిస్ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని లేదా సమర్థవంతంగా ఉపయోగించలేకపోయే పరిస్థితి. తద్వారా ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ (గ్లూకోజ్) స్థాయిల నిర్వహణను కష్టతరం చేస్తుంది. ఇది నియంత్రించబడకపోతే, కంటి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పాద ఆరోగ్య సమస్యలతో సహా సికెడికి మించిన ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం (డయాబెటిస్) అనేది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి). ఇటువంటి కేసులో 44 శాతం వాటికి కారణంగా మరియు జవాబుదారీగా వుంటుంది. మీరు డయాబెటిక్ కిడ్నీ వ్యాధితో జీవిస్తుంటే, నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. మధుమేహం, మూత్రపిండాలు.. రెండింటిపై శ్రద్ధ వహించాల్సి వుంటుంది. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
మధుమేహం మూత్రపిండాలను
ఎలా ప్రభావితం చేస్తుంది?
మూత్రపిండాలలో రక్తనాళాలు దెబ్బతినడం మరియు బలహీనపడటం లాంటివి డయాబెటిస్ దుష్ప్రభావాలలో వుంటాయి. రక్తం నుండి వ్యర్థాలు మరియు టాక్సిన్స్ (విషపదార్థాలు)ను మూత్రపిండాలు ఫిల్టర్ చేయాలి. దెబ్బతిన్న రక్తనాళాలు మూత్రపిండాలను పనిచేయకుండా నిరోధిస్తాయి. మూత్రపిండాల పనితీరు సరిగా లేకుంటే అది మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. చివరికి మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. డయాబెటిస్ వున్నవారు అధిక రక్తపోటుకు కూడా గురికావచ్చు. ఇది సికెడికి మరో ప్రధాన కారణం.
మధుమేహం కారణంగా శరీరంలోని నరాలు కూడా దెబ్బతినవచ్చు. ఇది మూత్రాశయం డ్రైనేజీలో ఇబ్బందికి దారితీస్తుంది. మూత్రాశయంలో సుదీర్ఘకాలం మూత్రం ఉంటే, అధిక చెక్కర స్థాయిలను కలిగి వున్న మూత్రంలో బ్యాక్టీరియా పెరుగుదల ప్రారంభమై దాని నుంచి ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది.
మూత్రపిండ వ్యాధి సంకేతాలు
తరచుగా దాహం, పదే పదే మూత్రవిసర్జన, అధిక రక్తపోటు, ఆకస్మికంగా బరువు తగ్గడం, మూత్రంలో కీటోన్స్/ప్రోటీన్ ఉనికి, అలసట, వాంతితోపాటు మార్నింగ్ సిక్‌నెస్, రక్తహీనత మరియు పేల్‌నెస్ (చర్మం రంగులో అసాధారణ లేతరంగు) వంటివి సంకేతాలు.
డయాలసిస్, డయాబెటిస్
అర్థం చేసుకోవడమెలా?
డయాబెటిక్ కిడ్నీ వ్యాధికి తీసుకునే డయాలసిస్ రకాన్ని బట్టి, చికిత్స డయాబెటిస్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది లేదా ప్రభావితం చేయకపోవచ్చు.
హీమోడయాలసిస్ మరియు డయాబెటిస్- డయాలసిస్ చికిత్స రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. హీమోడయాలసిస్ చికిత్స సమయంలో మీరు రక్తంలో చక్కెర వ్యత్యాసాలను చూసినట్లయితే, బహుశ అది మీరు మీ దినచర్యను మార్చుకుంటున్నందున అయి ఉండవచ్చు. మీరు తీసుకునే ఆహారం లేదా మీ డయాబెటిస్ నియంత్రణ నిర్వహణపై మీకు సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
పెరిటోనియల్ డయాలసిస్
రక్తంలో చక్కెరను నేరుగా చికిత్స ద్వారా విడదీయవచ్చు. ఎందుకంటే పెరిటోనియల్ డయాలసిస్ (పిడి) డయాలైసేట్ డెక్స్టోజ్ అనే చక్కెరను కలిగి వుంటుంది. పిడి ద్రావణంలోని డెక్స్టోజ్, రక్తం నుండి అదనపు ద్రవాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుంది కానీ ఇది రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది. అదనంగా, డయాలిసేట్ వివిధ పరిమాణాల్లో డెక్స్టోజ్ కలిగి వుంటుంది. పెరిటోనియల్ డయాలిసిస్ యొక్క ప్రభావాలను భర్తీ చేయడానికి, ఇన్సులిన్ మోతాను పెంచుకోవాల్సి వస్తుంది. అందుకు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అందుకు అవసరమైన విధంగా మార్పులు ఎలా చేయాలో వారు మీకు నేర్పుతారు.

- డా. నిషిత్ మొహంతి నెఫ్రాలజిస్ట్