Others

మృదుస్వభావి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దయ అంటే కరుణ. ఈ కరుణ మృదుస్వభావులకే ఉంటుంది. మానవుల మనస్సులు మృదువుగా ఉండాలి. తమ జీవన విధానంలో తమ స్వభావాన్నీ, తమ నిత్య నైమిత్తక కర్మలను చక్కగా చూసేవారికి కష్టం కలుగకుండా ప్రవర్తిస్తూ తమ మనస్సులను జాగ్రత్తగా ఉండునట్లు చూసుకోవాలి. పరోపకారంలో దయ, కరుణ రెండూ నిండి ఉంటాయి. ఎదుటివారి కష్టాలలో సాయం చేయడంలో నిస్వార్థులై మెలగాలి. కష్టాల్లో ఉన్నవారికి ఊరట, ధైర్యం కలిగిస్తూ దయతో తమకు చేతనైన సాయం చేస్తూ ఉండాలి. భగవంతుడు కోరేది ఈ భావననే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వేదవ్యాసుడు చెప్పనే చెప్పారు.
శరణంబని వచ్చిన భీ
కర శత్రుని నయిన బ్రీతిగావ వలయుం
గరుణాపరుల తెఱంగిది
యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్
కరుణాహృదయుల స్వరూపాన్ని స్వభావాన్నీ ధర్మరాజు తన తమ్ముడైన భీమునికి చెప్తున్నట్టు ఎఱ్ఱన కవి వర్ణించారు.
చంపదగిన యట్టి శత్రువుతనచేత
జిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ
అని ఎంతో అనుభవశాలియైన వేమన కూడా చెప్పారు. దయార్ద్రహృదయుడినే భగవంతుడు మెచ్చుతాడు. రాజధర్మాల్లోకూడా దయకే ప్రత్యేకస్థానముంది. దయగల హృదయమే దైవమందిరం అని ముక్తకంఠంతో పెద్దలందరూ తీర్మానించారు.
కష్టాలలో ఉన్నవారినెవరినైనా వారు అడక్కపోయినా సాయం చేయడం భారతీయుల లక్షణం. శిబిచక్రవర్తి, దధీచి వంటి మహర్షులు మనకు ఆదర్శం. కనుక ప్రతివారిలోను అంతో ఇంతో దయాగుణం ఉండితీరాలి.

- పి.వి. సీతారామమూర్తి 9490386015