Others

భవబంధనాశకుడు భోళాశంకరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంగా దీపారాధన చేసినా, వెలిగించిన దీపం గాలికి కొండెక్కి ఇంకా ఆ ప్రమిదలో నూనె ఉండిపోతే ఆ వత్తి వెలిగించినా, కాసిని మారేడు దళాలను నమశ్శివాయ అంటూ శివలింగంపైన ఒక్కసారి వేసినా, చిన్న చెంబుతో నీళ్లు నమశ్శివాయ అంటూ శివలింగంపై పోసినా, అలా పోసేవాళ్లతో పాటు నిలబడి నమశ్శివాయ అంటూ నమస్కరించినా కార్తీకంలో శివభగవానుడు ఎనలేని సంపదను ఇస్తాడు. శివ అంటేనే మంగళం. అనేక మంగళాలను శివప్రసాదంగా అందుకోవాలి అంటే కార్తీకమే దానికి మార్గం. హరహర మహాదేవ శంభో శివశంకరా అని నోరారా పిలిస్తే స్మరిస్తే చాలు కైలాస వాసుడు భక్తజన రక్షకుడు పాహి అన్న శబ్దం వినగానే పరుగెత్తుకు వస్తాడు. స్వామి తన భక్తులందరినీ తారతమ్యం లేకుండా కాపాడుతాడు.
అటువంటి క్షేత్రమే యాగంటి. నిత్యనూతనంగా శోభిల్లే శైవక్షేత్రాల్లో యాగంటి ఒకటి. పరమేశ్వరుని ఉనికికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న ఈ బసవేశ్వరుని దర్శనం ముక్తిప్రదం అని శైవులంతా ఈ క్షేత్రాన్ని తప్పక కార్త్తీకంలో దర్శించుకుంటారు.
ఓ అమాయకుడైన చిట్టెప్ప అను భక్తుడు కొన్నాళ్ల క్రితం కర్నూలు జిల్లా బనగానపల్లెకు సమీపంలోని ఓ ప్రాంతంలో పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయాలనుకొన్నాడట.. ఎంత కష్టమొచ్చిన నేను ఆ శివయ్య దర్శించుకోవాలన్న దృఢ దీక్షతో ఆ చిట్టెప్ప తపస్సుకు మొదలెట్టాడు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు చిట్టెప్పను పరీక్షించదలిచి పులిరూపంలో వచ్చి చిట్టెప్ప ఎదురుగా నిలిచి గాండ్రించాడట. ఆ శబ్దానికి కనులు తెరిచిన చిట్టెప్పకు పెద్ద పులి కనిపించింది. సర్వాన్ని ఈశ్వర మయంగా చూచే చిట్టెప్ప ‘‘నే గంటి శివుణ్ణి నేగంటి ’’ అని ఆనందంతో పరవశించి శివదర్శనా నంద సంతోషంతో రాగాలు తీసాడట. ఆ నే గంటి నే నేడు యాగంటిగా మారిందని ఇక్కడి స్థలపురాణం చెప్తోంది. అందుకే తన్ను సదా స్మరించే భక్తుల కోరికలను సమయాభావం లేకుండా తీర్చేవాడన్న కీర్తిని ఆర్జిస్తున్నాడిక్కడి బసవేశ్వరుడైన పరమేశ్వరుడు.
యాగంటిలో కొలువైన పరమేశ్వరుణ్ణి ఉమామహేశ్వర నామంతో భక్తులు సంబోధిస్తారు. ఇక్కడి శివుని ఉనికిని తెలిపే బసవన్న కూడా నిలిచిప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉండడం ఈ ప్రాంత విశిష్టత.
ఈ బసవన్న గూర్చి పోతులూరి వీరబ్రహ్మయ్య ముందుగానే చెప్పారు. దిన దినాభివృద్ధి చెందు తున్న ఈ బసవన్న పెరిగి పెరిగి కలియుగాంతాన రంకె వేస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. ఇపుడు ఎక్కడ ఏమూల చూసినా పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన కాలజ్ఞాన విషయాలు నిజాలై కనిపిస్తూ ఉన్నాయ. వాటిని చూసినప్పుడల్ల వీరబ్రహ్మం గారిని స్మరించకుండా నేటి మానవులు ఉండడంలేదు. అట్లాంటి వింతల్లో వింత ఇక్కడి ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహం. విగ్రహం అన్నమాటే కానీ ఈ బసవన్నను చూస్తూ ఉంటే బతికిఉన్న బసవన్ననే కదా అన్నట్టు జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
సర్వాలంకరణతో దర్శనమిచ్చే వీర భద్రస్వామి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు. ఈ దేవాలయం లోని ప్రధానాలయ ప్రాంగణంలోని మండపంలో ఉమామహేశ్వరస్వామిని సాక్షాత్తు అగస్త్యుడు ప్రతిష్టించాడు. పానవట్టంపై ఉన్న లింగం మీద శివపార్వతుల మూర్తులున్నాయి. అగస్త్యుని అభీష్టం మేరకు ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివార్లు కొలువుదీరారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆలయానికి వెనకవైపు భాగం లో కేదారేశ్వరస్వామి, దర్శనమిస్తారు. పుష్కరిణి అగస్త్య పుష్కరిణి అంటారు. ఈ ఆలయానికి కుడివైపువున్న కొండమీద దాదాపు నూట యాభై అడుగుల ఎత్తున అనేక ప్రకృతి సిద్ధమైన గుహలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి. 12మెట్లు ఎక్కి వెళ్తే ముందర అగస్త్య గుహ వస్తుంది. అగస్త్యుడు ఇక్కడ చాలాకాలం తపస్సు చేసాడని ప్రతీతి. ఒకసారి ఈ దేవాలయంలో వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాలనుకొన్న అగస్త్యమహర్షి విగ్రహాన్ని మలుస్తుండేటపుడు అవాంతరం జరిగి ఆయన బొటన వేలు తెగి విగ్రహం తయారి ఆగిపోయందట. దీనికి ఏదో కారణం ఉంటుందనుకొని వేంకటేశ్వరుని గూర్చి తపస్సు చేస్తుండగా మరలా కాకుల వల్ల తపోభంగం జరిగిందట. అపుడు కాకుల మీద కోపం తెచ్చుకున్న మహర్షి ఇక్కడ కాకులు సంచరించవని శపించాడట. అందుకే నేటికీ ఇక్కడ కాకులు కన్పించవు.
ఇప్పటికీ ఈ గుహలో యాత్రికులకు వేంకటేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది. ఈ గుహ పక్కనే మరో గుహ ఉంది. దీనిని శంకర గుహ ఉంది. దీనిని రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న గుహలలో కలివింతలను ముందే చెప్పిన పోతులూరి వీరభద్రయ్య కూడా తన తపస్సును సాగించాడని ఇక్కడి నివాసితులు చెబుతారు. యాంగటి బసవన్నను, యాంగటి ఉమామహేశ్వరుల దర్శనం కోటి జన్మల పాపక్షయం అని అంటారు.

- డి. సుజాత వెంకట్రావు 8885622196