Others

డ్యూటీ అయిపోయింది దిగిపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే రైలింజన్ డ్రయివర్ దొరికాడు స్పానిష్ గవర్నమెంటు వారి రైల్వే కంపెనీ- ‘రెనే్ఫ’కి. బుల్లెట్ ట్రయిన్ అంటే టైముకి ముందు బాణంలాగా దూసుకుపోతుంది అనుకుని స్పెయిన్‌లోని శాంక్ టెండర్ నుంచి మాడ్రిడ్‌కి బల్లెట్ ట్రెయిన్ ఎక్కిన నూట తొమ్మిదిమంది ప్యాసింజెర్లు నాలిక్కర్చుకున్నారు.
డ్రయివరు గారు చాలా స్ట్రిక్టు కార్మికుడు. లేటుగా రాడు. డ్యూటీ అయినాకా క్షణం కూడా ఉండడు. ఈ బుల్లెట్‌ని మాడ్రిడ్ యింకా సగం దూరం వున్నది అనగా- ఒక చిన్న స్టేషన్ ఓసోర్నోలో ఆపి, దిగి చక్కాపోయాడు రుూనెల 18న. రాత్రి తొమ్మిది దాటింది. జనం, అధికారులూ అవాక్కయిపోయారు. బుల్లెట్ రైలింజనుకి- యిన్ని గంటలు మాత్రమే పరిగెత్తాలని రూలుంది. గానీ డ్రయివర్లు యిలా అధ్వాన్నంగా జనాల్ని ముంచేసి- రైలు దిగి వెళ్లిపోవడం కార్మిక రూల్సులో కూడా లేదు.
ఐతే, చాలా మొండివాడా డ్రయివర్. ఈడిగిలపడ్డ ఎద్దులాగా కదలడే. రైల్వే కంపెనీ పాపం, టాక్సీలనీ, బస్సులనీ బెత్తాయించి, అందులోకి ఎక్కించింది పాసెంజెర్లని. బాబ్బాబూ! తిట్టకండి. మీకు ఫుల్ రిఫండ్ ఇస్తాం’’ అన్నది.
ఇలా రైలు ప్రయాణాలకే యిలాంటి యిబ్బందులనుకుంటామా- విమానాల్లో వెళ్లినా గ్రహచారం బాగులేకపోతే- ‘లుఫ్తాన్సా’ (జర్మనీ) విమానం అయినా సరే మధ్యలో రెక్కలు విరిగిన పక్షిలా దిగిపోతుంది. వాషింగ్టన్ నుంచి జర్మనీలోని మ్యూనిక్ సిటీకి పోదామని ఎగిరిన విమానంలో- 17వ తేదీన అర్థాంతరంగా దారి మళ్లింది. విమానంలో మూడొందల మంది ప్రయాణీకులు వున్నారు. సిడ్నీకి 70 మైళ్లు ఆగ్నేయంగా, కెనడాలో వున్న నొవాస్కోలెయా మీద ఎగురుతుండగా- ‘‘పొగ.. పొగ.. వాసన’’ అంటూ గోల మొదలయింది విమానం లోపల.
విమానంలో కాఫీ మేకర్లుంటాయి. ఓ కాఫీ మేకర్ ద్వారా కప్పులో కాఫీ నిండింది గానీ- ‘ఆఫ్’ అవను పొమ్మంది. వేడెక్కి పోయి, పొగలు చిమ్మటం ప్రారంభం అయింది. సిబ్బందికి హడలు పట్టుకుని ‘‘అర్జెంటుగా దిగిపోతున్నాం’’ అంటూ బోస్టన్‌కి దారిమళ్లించారు. కాఫీ యంత్రం ఎలా పనిచేస్తుందో విమాన సిబ్బందికి తెల్సు. ట్రెయినింగ్ యిస్తారుగానీ, విద్యుత్ సప్లయ్ తెగకపోతే ఏం చెయ్యాలి? తెల్దు.. అందుకే దింపేశారు. ఇంజనీర్లు వచ్చారు. 70 నిమిషాలు లేటుగా విమానం మళ్లీ లేచింది. ‘నో కాఫీ’ అన్న బోర్డెట్టేశారు. ఇదీ ప్రయాణంలో ‘కచటతపలు’ అంటే!

-వీరాజీ