Others

నేడు తెలుగు ‘లెస్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుజాతి నాది- తెలుగువాడను నేను
అమ్మభాష నాది- అచ్చతెలుగు
అమ్మభాష చదివి- అభివృద్ధి చెందితి
తెలుగుభాష రుణము- తీర్చకొంటి

ప్రాణమమ్మభాష- ప్రగతికది పునాది
అమ్మభాష చదవ- అన్యభాష
లభ్యసింప సులభమనిరి నిపుణులెల్ల
బాషలందు తెలుగు భాష లెస్స

అమ్మపాలు శిశువుకమిత బలమునిచ్చు
అమ్మ జోలపాట హాయిగొల్పు
అమ్మభాష నేర్ప అమ్మే తొలిగురువు
తొల్లి బడిశిశువుకు తల్లియొడియె

ఇంగిలీసు చదివి, ఇంటిభాష మరవ
అమ్మ, నాన్న పిలుపులు అంతరించె
మమ్మి- డాడి పిలుపు కమ్మదనంబయ్యె
అత్త, పిన్ని, కడకు ‘ఆంటీ’లయ్యె

మాతృభాషపై మమకారమే లేక
రాష్ట్ర భాష మీద రాగముడిగి
ఆంగ్లభాషయన్న అంతమక్కువ యేల?
మరవరాదు మనము మాతృభాష

ఇష్టమున్న చదవవచ్చు ఇంగిలీషు
శాసనమదియేల- చదవమంచు
గెలువలేకనింట- గెలువ సాధ్యమె రచ్చ
కన్నతల్లిమీద కక్ష వలదు

కన్నతల్లి భాష- కంటి చూపనదగు
అన్యభాష కళ్ళ అద్దములగు
బడిని, గుడిని, భాషను నేతలు
రచ్చకీడ్పతగునె- రామరామ

అమ్మ భాషకిపుడు అగచాట్లు వచ్చెను
కన్నబిడ్డలకట చిన్న చూపు
చూడ పొరుగువారు- చులకన చేయరె
దిక్కులేనిదయ్యె- తెలుగుభాష

లేడు కవిరాజు, పోతన లేడు నేడు
కంటినీరు తుడువ నాటి కవులు, రెడ్డి
రాజులష్టదిగ్గజములు రాయలకట
నన్నయార్యుడు తిక్కన లెన్నలేరు.

-డా. వల్లభనేని హనుమంతరావు 94411 09228