Others

పనికోసం యాచన ఫర్వాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలకు పని ఇవ్వడానికి బదులుగా బిచ్చం వేయడాన్ని ఆయన ఆమోదించేవాడు కాదు. భారతదేశంలో బిచ్చగాళ్ళ సంఖ్య 56 లక్షలు దాటిపోవడాన్ని ఆయన నిరసించేవాడు. శారీరకంగా పనిచేసే శక్తిలేనివారు తప్ప వేరెవ్వరూ సమాజానికి పనికొచ్చే పని చేయకుండా దాన ధర్మాలమీద జీవించడం ఆయనకు నచ్చేది కాదు. బిచ్చమెత్తడమే కాదు, బిచ్చం వేయడం కూడా తప్పే అనేవాడాయన. శరీరంలో ఓపిక వున్నంతకాలం బిచ్చం ఎత్తడమంటే దొంగతనంతో సమానమే.
బీహారు భూకంపంలో బాధితులై, సహాయక శిబిరాలలో ఆశ్రీతులుగా ఉన్నవారిని వారి ఆశ్రయానికి, ఆహారానికి, దుస్తులకు తగిన పని చేయాలని ఆయన సూచించాడు. ‘‘పని మరిచిపోతే మీరు ప్రభుత్వంమీద ఆధారపడటానికి అలవాటుపడతారు. అలా ప్రజాధనం మీద ఆధారపడటం తప్పు. నిజాయితీతో పనిచేయండి. ఎవరూ బిచ్చగాళ్ళు కావద్దు. పనికోసం అడగండి. అప్పగించిన పని శ్రద్ధగా చేయండి. పని చేయండి, అడుక్కోవద్దు’’ అని ఆయన సూచించాడు.
బందిపోటు
గాంధీ బిచ్చగాళ్లకు రాజైతే బందిపోట్లకు యువరాజు కూడా. భారతదేశంలో రోజురోజుకీ ధనవంతులు మరింత ధనవంతులు కావడం, బీదవాళ్ళు మరింత బీదవాళ్ళు కావడం ఆయన చూశాడు. ఆయన సమానత్వానికి తన సొంత నిర్వచనాన్ని పరిచయం చేయదలుచుకున్నాడు. గ్రామీణ జీవితాలను పునఃవ్యవస్థీకరించి గ్రామీణులకు ఆర్థిక సమస్యలనుండి విముక్తి కల్పించడమే ఆయన లక్ష్యం.
అవసరంలో వున్నవారిని ఆదుకొనేందుకు ఆయన ధనికులను దోచుకున్నాడు. మండే కాగడాలు, మెరిసే కత్తులకు బదులు ప్రేమతో ఒప్పించడం, నైతికంగా బలవంతం చేయడాన్ని ఆయన దోపిడీకి సాధనాలుగా ఎంచుకున్నాడు. ధనాన్ని త్యాగం చేయమని ధనికులకు, వారి జ్ఞానాన్ని సామాన్యులతో పంచుకోమని పండితులకు, తమ లాభాలను కార్మికులతో సమానంగా పంచుకోమని పెట్టుబడిదారులకు పాలితులకు మానవ హక్కులు కల్పించమని పాలకులకు, తమ నిస్సత్తువను వదిలించుకోమని బద్ధకస్తులూ, బిడియస్తులూ అయిన గ్రామీణులకూ గాంధీ విజ్ఞప్తి చేశాడు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని విదేశీ పాలకుల చేతుల్లోంచి పాలనా పగ్గాలు లాక్కోమని ఆయన దేశస్తులను ప్రోత్సహించాడు. అంకితభావంతో కూడిన ఆయన హృదయపూర్వకమైన అభ్యర్థన యువకులనూ, వృద్ధులనూ, సామాన్య గ్రామీణ ప్రజలనూ, తెలివిగల వ్యాపారులనూ ఒకే విధంగా ఆకట్టుకొనేది. ఆయన భారతదేశం ఒక మూల నుంచి మరొక మూలకు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలు తమ సంపదలను, సంతానాన్ని, సమస్తాన్ని దేశం కోసం సమర్పించేలా ప్రోత్సహించాడు. స్తంభించిపోయిన మెదళ్లలో ఆయన చైతన్యం నింపాడు. ఆయన కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను దేశ సేవకు పంపారు, ముత్తయిదువలు తమ ఆభరణాలను, పేదలు తమ వద్ద వున్న చిల్లర సైసలను ఇచ్చేశారు.
ఒకసారి ఒక ప్రాంతంలో పంటలు పండలేదు. రైతులు నిస్పృహలో ఉన్నారు. కానీ పూర్తి పన్నులు కట్టాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. పన్ను వసూలుదారుల ఆగడాలకు భయపడిన రైతులు బకాయిలు తీర్చేందుకు తమ ఎద్దులు, నాగళ్లూ అమ్మాలని అనుకుంటున్నారు. పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి ఎదురుతిరగమని గాంధీ వారికి సూచించాడు. రైతులు పన్ను వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. గాంధీగారి నాయకత్వంలో సత్యాగ్రహులైన కొందరు రైతులు ‘‘ఇందుమూలంగా మేము యావన్మందీ ఈ ఆర్థిక సంవత్సరంలో మా పొలాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకైనా అంగీకరిస్తాం కానీ ప్రభుత్వానికి పన్నులు చెల్లించమని’’ ప్రమాణం చేశారు. ప్రభుత్వం పంటలతో సహా పొలాలను స్వాధీనం చేసుకొంది. తమ శ్రమ ఫలితాన్ని వాళ్లు అనుభవించే హక్కు ఉందని గాంధీ రైతులకు చెప్పాడు, కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఉల్లిపాయల పంటను దోచుకోమన్నాడు. ఆయన సూచనల ప్రకారం కొందరు కార్యకర్తలు పంటను పొలంలోంచి తెచ్చేసారు. ఆ దోపిడీ ముఠాకు నాయకుడైన మోహనలాల్ పాండ్యాను అరెస్టు చేశారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614