Others

అందాన్ని పెంచే గుమ్మడి నూనె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మడిపండును వంటకాల్లో వాడడం అందరికీ తెలుసు. కానీ ఆ ఆయిల్ మన అందాన్ని కూడా ఇనుమడింప చేస్తుందని తెలుసా? గుమ్మడిపండు గింజల నూనెలో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో పాటు అది జుట్టును, చర్మాన్ని కూడా ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అవేంటో తెలుసుకుందాం.
* గుమ్మడిపండు గింజల నూనెలో ఎన్నో మేలిమి గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ వంటి ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, ఐరన్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
* గుమ్మడి గింజల నూనెను ముఖానికి రాసుకుంటే చల్లగా ఉంటుంది. చర్మానికి కావాల్సినంత తేమ అందుతుంది. గుమ్మడి పండు గింజల నూనె వాడకం వల్ల యాక్నె, నల్లమచ్చలు వంటివి రావు. విశేషమేమిటంటే ఎంతో పేరున్న ఫేస్ సిరమ్, హ్యాండ్ క్రీమ్స్ వంటి సౌందర్య ఉత్పత్తుల్లో కూడా గుమ్మడి పండు గింజల నూనెను వాడుతున్నారు.
* ఈ ఆయిల్ జుట్టును, చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. వాటి అందాన్ని ఇనుమడింపచేస్తుంది. జుట్టు బాగా పెరగడంతో పాటు సిల్కులా మెరుస్తుంది కూడా.
* గుమ్మడి గింజల నూనెను వంటకాల్లో వాడటం వల్ల శరీరంలోని హార్మోనులు సమతుల్యత చెంది మెనోపాజ్ లక్షణాల తీవ్రత సైతం తగ్గుతుంది.
* గుమ్మడి గింజలను సలాడ్స్‌లో వాడటం వల్ల శరీరానికి ఎంతో మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు.