AADIVAVRAM - Others

కోపర్నికస్ సిస్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలిష్ ఖగోళ శాస్తవ్రేత్త నికోలస్ కోపర్నికస్ తన అద్భుత ఊహాశక్తితో, శాస్ర్తియ ఆలోచనతో సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్నది - భూమి కాదని, సూర్యగ్రహమని కొన్ని ఉదాహరణలతో నిరూపించాడు. దీనిపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చాయి.
కానీ కొనే్నళ్ల తర్వాత ఆయన ప్రతిపాదించిన సూత్రమే నిజమని తేలింది. అంతకు ముందు సౌర వ్యవస్థలో భూమి కేంద్ర స్థానంలో వుందని టోలోమి చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మేవారు. నిజానికి సౌర వ్యవస్థలో భూమి మధ్యభాగంలో వుంటే ఉష్ణోగ్రత అధికంగా ఉండి ప్రాణులు బతకడానికి అవకాశం లేకుండా ఉండేది. ఇంత గొప్ప వాస్తవాన్ని 1543లోనే కనుగొని కోపర్నికస్ మానవాళికి ఎంతో మేలు చేశాడు.
కోపర్నికస్ సిద్ధాంతసారం అంతరిక్షంలో పరిభ్రమించే గ్రహాల పరిభ్రమణాలు ఒకే క్రమంలో హెచ్చుతగ్గులు లేకుండా ఒకే వేగంలో ఉంటాయి. విశ్వం కేంద్ర స్థానం సూర్యుడికి సమీపంలో ఉంది. సూర్యుడి చుట్టూ మెర్క్యురీ, శుక్ర, భూమి, చంద్ర గ్రహాలు ఉన్నాయి. సూర్యుడికి ఇంకా కొంత దూరంలో అంగారక, గురు, శని గ్రహాలు ఉన్నాయి. టోలోమి సిద్ధాంతం తప్పు అని, కోపర్నికస్ సిద్ధాంతం వాస్తవమని తెలుసుకోవడానికి 200 సంవత్సరాలు పట్టింది.

-నాయక్