Others

జయం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే బాధతో కుంగిపోవడం సాధారణ మానవులకు సహజం. గెలుపు ఓటములు జాతకాలను అనుసరించి ఉంటాయని గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం. అసలు ఓటమి ముఖ్యకారణం మీరు సరియైన ప్రయత్నం చేయకపోవడమేనని పెద్దల జీవిత చరిత్రలు మనకు బోధిస్తున్నాయి. మనం సరైన పనులు చేసినా, మనకు చెందవలసినవి చెందకుండా ఉంటే అవి మనకు దక్కకపోయనా వాటివలన ఇతరులకు మేలు జరిగితే మనం సంతోషించే నేర్పును అలవర్చుకోవాలి.
దానివల్ల మనకు ఎక్కడలేని ఆనందం వస్తుంది. తృప్తి కలుగుతుంది. కనుక ఎపుడూ చేసే పనుల వల్ల నలుగురూ సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో ఫనిచేయాలి. ఐక్యభావంతో ఉండడమని బోధించడంలో అర్థం అదే. అనుకొన్నది సాధించడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని బట్టి ఫలితం మనకు వస్తుంది. మనం చేయవలసిన కృషి అంతా చేసి అపుడు భగవంతునికి నమస్కరించి నేను చేయదగినదంతా చేశాను. ఫలితాన్ని నాకు అనుకూలంగా ఇవ్వు అని కోరుకుంటే తప్పక ఫలితం వస్తుంది.
కొండలమీద కురిసిన వర్షం మొదట జలపాతమై, తర్వాత చిన్న చిన్న నదులుగా మారి, పల్లాన్ని వెతుక్కుంటూ వెళ్లి, చివరకు సముద్రంలో కలిసిపోతుంది. పుట్టిన నిమిషం నుంచే నది సముద్రాన్ని చేరడానికి తహతహలాడుతూ ప్రయాణం చేస్తుందని అనుకుంటామా? దారిలో ఆనకట్ట కట్టి నిరోధిస్తే సముద్రంలో చేరలేకపోయానే అని బాధపడుతుందా? అంతా వాస్తవ పరిస్థితులను బట్టే జరుగుతుందని గ్రహించాలి. దేనినైనా నిర్వహించగల సామర్థ్యం సాధిస్తే,ఫలితాలు మనకు అనుకూలంగా మారవచ్చు. స్వశక్తితో తగిన కృషి చేస్తే తప్పక గెలుపు తీరాలను తాకవచ్చు. కనుక కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ కృషి చేయాలి. ఈరోజు కాకపోతే రేపు మంచి ఫలితం మనది అవుతుంది.
కానీ చేయవలసిన దాన్ని ఏదీ చేయకుండా కేవలం కోరిక ఫలితం కావాలి అనుకొంటే అది దేవుడు ఎపుడూ నెరవేర్చడు. వేదం కూడా కష్టపడినపుడు మాత్రమే ఫలితం నీకు దక్కుతుంది అని చెబుతుంది. కానీ కష్టం లేకుండా ఫలితం ఫలాన స్తుతి వల్లనో, లేదా వ్రతం వల్లనో వస్తుందని చెప్పదు. కష్టే ఫలి అనడంలో అంతరార్థం కష్టపడితే నే ఫలితం దక్కుతుందని చెప్పడమే. ప్రతివారు కష్టపడడం నేర్చుకోవాలి. అసలు మందుడు కూడా ఏపనీ చేయకుండా ఉండలేని విధంగా ఉంటాడని గీత చెబుతుంది. మరి ఆ చేసే పనిఏదో మంచిపని నలుగురికీ మంచి ని కలిగించేపని చేస్తే ఇటు పుణ్యమూ అటు ఫలితమూ దక్కుతుంది. ఎపుడైనా నేను ఒక్కడినే బాగుండాలి అనే కోరికతో కాక నలుగురూ పచ్చగా ఉండాలన్న కోరికతో ఏ పని చేసినా అది శుభఫలితానే్న ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని తన జీవితంలో చేసి చూపించాడు. కనుక కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకొని కష్టించి పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.
*