Others

అబల విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉ॥
బోడితలన్ సుమంబులను పూయగజేయు మహానుభావ! పూ
బోడి కళాలయంబునకు పోవగజేసిన ‘కందుకూరి’! నీ
పోడిమికిన్ చెదల్‌పరచు పుణ్యము కట్టుకొనెన్ సమాజ మీ
నాడిల ఏది రక్షణము? నాతికి-నీతికి గోయియే గదా!

* ఉ॥
నీ ‘తృణకంకణంబు’మనెనే? అది నీరయిపోయెనేమి? ప్రా
భాత వినిర్మలంబయిన భవ్యభవత్ప్రణయంబు నేటి ఈ
కోతిని పుట్టు మానవునకున్ లభియించెడు రత్నకంకణం
బైతగ ‘రాయప్రోలు’! తనరారెనె? ఆరెనె? ప్రేమదీపమే॥

* ఆ.వె.॥
పాలుత్రాగునట్టి పసిపాపపై గూడ
వ్యభిచరించునట్టి భ్రష్టపురుష
జాతిదైన దుష్ట సంస్కృతి చెలరేగె
సిగ్గుతోడ జనము చిమిడి పోవ॥

* ఆ.వె.॥
అర్ధరాత్రి కాదు- అసలు- పట్టపగంటి
యందునైన రక్ష అబలకునె్న?
భారతాన నేటి ఘోరాలు కనుచు స
త్యమ్ము- గాంధీ విగ్రహమ్మె అయ్యె॥

* ఆ.వె.॥
మెలతబ్రతుకులోని మెలికలే ఆ ‘స’కా
రంబు-రంపకోత ‘క్రావడి’ పుడు;
తాళికూర్చు వ్యథకు తాకట్టె ‘తావత్తు’
‘దీర్ఘగుడి’గ ఎపుడు తెఱవనిలుచు?॥

- రామడుగు వేంకటేశ్వరశర్మ 98669 44287