Others

విపత్తును సంఘటితంగా నివారిద్దాం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మనిషిని, మనిషిలా చూసేది భూమి ఒక్కటే! మట్టి కాళ్లను ముద్దాడుతుంది. నీరు దాహాన్ని తీరుస్తుంది. వాయువు ప్రాణాన్నిస్తుంది. అగ్ని ఒకేలా వెలుగునిస్తుంది. ఈ సృష్టిలో శాశ్వతమైన పంచభూతాలకు లేని ఏ గర్వం, స్వార్థం అశాశ్వతమైన జీవికి మనిషికి ఎందుకు ఈ దుర్మార్గపు పనులు. అవసరానికి మించిన ఆశలు, ఆశలకు మించిన దురాశలు.. సహజత్వాన్ని మరిచిపోతూ.. కాలుష్యాన్ని పెంచుతూ పోవడమే మనిషి దురదృష్టం. అందుకే మనకు కష్టం పొంచి వుంది. ఎంత శాస్త్ర సాంకేతిక జ్ఞానం సంపాదించుకున్నా ప్రకృతి ముందు ఏపాటి? తెలివితో భూమిపై గుంటలు తవ్వగలం, పూడ్చగలం, గుట్టలుగా పేర్వగలం, కాని ‘మట్టిని’ సృష్టించలేము. ‘మేధో సంపత్తితో ఎన్ని అద్భుతాలు ఆవిష్కరించినా.. ‘సాలెగూడు’ లాంటిదే. ఆధునిక శాస్త్ర సాంకేతికతపై చిన్నచూపు కానే కాదు! నేలవిడిచి సాము చేయరాదని, సహజ వనరులను తిరిగి సృష్టించలేమని భావన. ప్రకృతిలో విలువైనవి, అందమైనవన్నీ ఉచితమే. ఈ ప్రకృతి సోయగాలు మనిషికి స్ఫూర్తినింపాలి. జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన వరమే ‘కాలం’. ఆ కాలం పేదవానికైనా, ధనికునికైనా సమానమే. పేద, ధనిక అనే తేడా లేకుండా పుడమిపై విపత్తుకు కారకుడౌతున్నాడు. ఈ తీరుమారాలి.
ప్రకృతికి, పర్యావరణానికి మనిషి చేస్తున్న విధ్వంసం (చేటు) మూలంగా భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకం కానున్నదని తెలుస్తుంది. భూగోళం అత్యయిక పరిస్థితిలోకి వెళ్లిందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వార్థ మానవాళి పోకడలు పెచ్చరిల్లిపోతున్నాయి. కాలుష్యం కారణంగా వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం ఒకవైపు ముంచుకొస్తుంటే! ఈ పరిణామాలవల్ల కార్బన్-డై ఆక్సైడ్‌ను ఇంతకాలం నియంత్రిస్తున్న అడవులు, ఇప్పుడు అదే వాయువును ఉత్పత్తిచేసే స్థానాలుగా మారుతున్నాయి. మానవ ప్రమేయంతో ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా భూమిపై 9రకాల శాశ్వత నష్టాలు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పెరుగుతున్న కాలుష్యం, భూతాపం, వాతావరణంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. గత 50 ఏళ్లుగా పర్యావరణపరంగా నెలకొన్న వాతావరణ మార్పులవల్ల పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసం, మారుతున్న వర్షపాత తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తక్షణమే మేల్కొనాలి. ఉద్గారాల నియంత్రణకు పాలకులు కఠిన చర్యలకు పూనుకోవాలి. ప్రపంచ దేశాల పాలకులు (సమాజం) కూడా మేల్కొనకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. పరిశోధకులు, శాస్తవ్రేత్తలు గుర్తించిన మార్పులు.
- అమెజాన్ అడవులు అంతరిస్తుండటం.
- ఆర్కిటిక్ సముద్రం మంచు కరుగుతుండటం.
- అట్లాంటిక్ తదితర సముద్రాల్లో జీవజాలం అంతరిస్తుండటం.
- గ్రీన్‌లాండ్, పశ్చిమ, తూర్పు అంటార్కిటికాలో మంచు పలకలు తగ్గడం.
- భూమిపై మంచు శిలలు (పెర్మాప్రాస్ట్) కనుమరుగవుతుండటం.
- ఉత్తరార్థగోళంలోని అడవులు నాశనమవుతుండటం.
- పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.1 డిగ్రీల మేర పెరిగాయి. 2040 నాటికి ఇవి 1.5 డిగ్రీలు దాటవచ్చు. అదే జరిగితే మంచుకరిగి, సముద్ర మట్టాలు 10% పెరుగుతాయి. ఫలితంగా తీర ప్రాంతాలు నీటమునుగుతాయి.
భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావంవల్ల సంభవిస్తున్న వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, నివారణ చర్యలకు పూనుకోవాలి. వాతావరణ మార్పులవలన వచ్చే ఉపద్రవం నుండి మానవాళిని కాపాడుకోవడానికి, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండుటకు పూనుకోవాలి. ఉమ్మడిగా కార్యాచరణను వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చిత్తశుద్ధితో మొదలెట్టాలి. తక్షణమే ప్రపంచ దేశాల సదస్సును ఏర్పరచి ప్రకృతి, భూగోళ పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో అమలయ్యేలా కఠిన నిబంధనలు అమలుచేయాలి.
అసంఖ్యాకమైన జనాభా, వైద్య - ఆరోగ్య సదుపాయాల్లో తీవ్ర అసమానతలు, పేదరికం, పోషకాహార లోపం లాంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. విశ్వంలో జీవరాశులకు అనువైనది భూమియేగదా! పంచభూతాలను స్వార్థ మానవాళి విధ్వంసం చేయడం వలన ప్రకృతి సంపద అంతా వ్యాపారమయమైంది. జలముకోసం భూమిపై నిలువెల్లా తూట్లు పొడుస్తూ (బోర్లువేస్తూ) భూఅంతర్గత పొరలను అంతమొందిస్తున్నారు. దీని మూలంగా భూకంపాలు వస్తున్నాయి. అడవులను, గుట్టలను, సహజ సంపదలన్నింటినీ స్వార్థబుద్ధితో చాపచుడుతున్నారు. ‘‘తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్నామన్న’’ సంగతి తెలుసుకోలేకపోతున్నారు. పంచభూతాలను పరిమితిగా వాడుకుంటే అందరి కోరికలు తీరుతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. భావితరాలకు మేలుచేసినవారౌతారు. సకల జీవకోటికి భూమి ఆధారం. ఈ స్థితిలో భూమిలేని క్షణం ఊహింపజాలము. పంచభూతాలనుండి మనిషి నేర్చుకునేది చాలా ఉంది. సహనం కనికరంతో ఉండాలి. నిప్పులాగ అన్యాయాలను దగ్ధం చేయాలి. గాలి జీవకోటికి ప్రాణవాయువు నిచ్చినట్లు ఇతరులకు మేలుచేయు గుణం కల్గిఉండాలి. ఆకాశంలా విశాలమైన హృదయం కల్గి ఉండాలి.
భూతాపం పెరుగుతున్నందువలన వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణవౌతుంది. ప్రధానంగా కాలుష్యం పెచ్చరిల్లి ప్రపంచ భవిష్యత్తు, పౌర సమాజం పెనుముప్పునకు దారితీయబోతున్నట్లుందని నిపుణుల హెచ్చరికల నుండి అప్రమత్తంతో ఉండాలి. భూతాప నియంత్రణ చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమైతే మనిషి మనుగడే ప్రశ్నార్థకంగామారే ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్కర పరిణామాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తినుండి.. ప్రపంచ దేశాలన్నీ సంఘటితంగా ప్రకృతి, భూమి, పంచభూతాల విధ్వంసం, కాలుష్య నివారణకు వెనువెంటనే పూనుకోవాలి. నిర్లక్ష్యంచేస్తే రాబోవు తరాలకు మనమే చేతులారా నష్టంచేసిన వారవౌతాము. చర్చలు జరపండి.. చర్యలకు పూనుకోండి.. భూగోళానికి భంగం వాటిల్లేలా, పర్యావరణానికి ప్రమాదం చుట్టుముట్టేలా ప్రణాళికరహిత పారిశ్రామికీకరణ, వ్యర్థాలవలన వాయు, జల, నేల కాలుష్యాలకు మానవులలో జడలు విప్పుకున్న స్వార్థమేనని తెలిసిపోతుంది. వాతావరణ మార్పులవల్ల మితిమీరిన ఎండలతో భరించలేని వేడి, అకాల వర్షాలు, ఋతువులు గాడి తప్పడం, వరదలు ప్రళయ గర్జనలు, భూకంపాలు, కొత్త వైరస్‌లు, మంచు తుఫానులతో తీవ్ర సంక్షోభం ఏర్పడబోతుందని తెలుస్తుంది.
పాలకులు పాలితులు భూమిని, పర్యావరణాన్ని చల్లగా పదిలంగా ఉండేలా ప్రజలంతా ప్రకృతి సమ్మతమైన జీవన వైవిధ్యాలు పాటించాలి. పర్యావరణానికి విధ్వంసం కలిగించనివిధంగా అభివృద్ధి రూపొందించుకోవాలి. ప్రపంచ దేశాల పాలకులు, ఐక్యరాజ్యసమితి మన ముందుతరాలకోసం మనమంతా చైతన్యవంతులమై ధరణిలో జీవవైవిధ్యం కలకాలం సుభిక్షంగా వర్థిల్లబడాలి..

- మేకిరి దామోదర్, 9573666650