Others

దత్తుని చరణములే శరణములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందెందు వెదకి చూచిన అందేముంది
భవబంధముల కుప్పలు తప్ప
ఎంత ఎత్తు పైపైకి చూచిన నీలాకాశంలోని
నల్లనల్లని మబ్బుల గుంపులు తప్ప
ఎన్ని పరుగులిడినా ఆశల విఫల
ఆయాస ప్రయాస తిప్పలు తప్ప
వెండి కొండలపైన వెలుగుచున్న
చంద్రవౌళి చల్లని చూపులే
నా అంతరంగకాంతుల ఒప్పులు

వెంకటాద్రి ఏడుకొండల వేంకటేశుని
వెయ్యి వెయ్యి లడ్డూల కంటె
ఖాద్రీక్షేత్ర లక్ష్మీనరసింహుని
దద్యోధన ముద్దలకంటె
భద్రాద్రి శ్రీరామచంద్రుని
కమ్మని పులిహోర పొట్లముకంటె
సహ్యాద్రి దత్తదేవుని తీయని
కలకండ పలుకులే ఆత్మానందమిచ్చు
అసలైన జ్ఞాన ప్రసాదవిందు
దత్తమిఠాయి బహు పసందు

భాగవతాశ్రవణం కృష్ణలీలల దర్శనం
హరిహరుల కథల పఠనం అమృతపానం
పరమ పవిత్రం శ్రీపాద శ్రీవల్లభుల దివ్యచరిత్రం
చర్విత చర్వణయోగం
సచ్చిదానందుని భాషణం
రాగరాగిణి రసమయ నాదకీర్తనం

భూమ్యాకాశరాజుల సంతానం
పద్మావతీ దేవి అవతారం
బృహస్పతీ ఋషుల ఆశీర్వచనం
కుబేరుని తీరని ఋణంవకుళాదేవి రాయబారం
జన్మజన్మల పుణ్యఫలం
శ్రీవేంకటేశ పద్మావతీ దేవుల కల్యాణం
సృష్టిస్థిత్యంత కారణం
నింగిలోన నీలిరంగు
సాగర పొంగులలో ప్రతిబింబం
ఆ లోచనల లోని తరంగం
అంతరంగంలోని మృదంగం
నేలలోని సహస్రయోనులలో
అద్భుత ఓషధుల జననం
అన్నరస సారం ఋషుల రేతస్సులో
అణుకణ జీవప్రాణం
సహాద్రి నుండి వీచు చల్లని మలయ మారుతములు
నిండు పున్నమి నాటి జాబిల్లి చల్లని వెనె్నల జల్లులు
కావేరీనదీమతల్లి ప్రవాహ నీటి తుంపరుల
గజ్జల గలగలలు
సత్యం అవతరించెను జయలక్ష్మీ
మాతకు జగతికి జయం జయం అభయం
గువ్వల గుసగుసలు గురుదత్తుని
గుర్తులని గుర్తించాను
సెలయేరుల గలగలలు గురుదేవుని
రాయంచ నడకలనుకున్నాను
పికముల లాస్యాలు శుక ములకిలకిలలు
దత్తదేవున పలుకులనుకున్నాను
హృదయంలో ఏమో తెలియని
కుతకుతల లుకలుకలు ఆగిపోయెను
నా దత్తుని తీయని పిలుపులతో

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899