Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలితం బాఢ్యమునైన రాజ్యము తృణ ప్రాయంబుగా వీడి చం
చలవౌ ప్రబ్బలి నొప్పు నీ దరి నివాసంబై సుథామాధురీ
కలనన్ మించు భవత్పవిత్ర జలమా కంఠంబుగా గ్రోలువా
రల యానందము గేలిసేసెడును నిర్వాణోన్నతస్థానమున్

ఉదయాదిత్యుని వోలె బ్రస్ఫుటము వక్రోద్గ్ఢావౌ గౌరి కో
పడ్పగా పేక్ష మొనర్పనొక్క త్రుటి తీవ్ర క్షోభము చెంది యా
మదన స్పర్థి శిరంబునం దొరలు యుష్మత్తుంగ భంగచ్ఛటల్
ప్రిదులం జేయుత మామ కోగ్ర దురితావిర్భూత సంత్రాసమున్...

వఱువాన్ జలమాడు రాజ రమణీ వక్షోరుహ న్యస్త క
స్తురి సమ్మేళన మొప్పుడొందెడును నీతోయంబు లంద పై వి
స్ఫుర దేహంబులు దాల్చి కస్తురి మృగంబుల్ స్వేచ్ఛయై జొచ్చుని
ర్జర కాంతార మనంత దివ్య నిచయా క్రాంతంబులై జాహ్నవీ!

అనుకొనినంత శాంత హృదయంబున గూర్చుచు నెన్నడేని గీ
ర్తన మనరించినంత భవతాపము పాపము బాపు నిట్టి పా
వనమగు గంగ యనుశ్రుతి పర్వకరంబగు మేలి సూక్తి రుూ
తనువు దొరంగువేళ నిరతంబు నెలర్చుత మన్ముఖంబునన్..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404