Others

ఆత్మజ్ఞాన ప్రబోధం.. వరప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు జనన మరణ పరంపర నుండి విముక్తి పొంద గోరినప్పుడు ధ్యానము పూజ జపము మొదలైన సాధన మార్గములు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. కాని ఎన్ని సాధనాలు చేసినా గురుకృపను పొందగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది. కనుక ధ్యానిస్తే గురుదేవుని స్వరూపమునే ధ్యానించాలి. లౌకిక విద్యలు నేర్పే గురువులు విద్యాగురువులు వీరు పునర్జన్మ రాహిత్యం చేసే ఆత్మవిద్యను ప్రసాదించలేరు. తమను ఆశ్రయించిన వారికి సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్కాళీ ప్రసాదబాబు కల్పవృక్షము.
‘‘వీరుల జన్మంబు నేరుల జన్మంబులెరుగ నగునె’’అని మహాభారత వాక్యం. ఇక్కడ వీరులు అంటే దేహాత్మభావమును జయించిన ఆత్మజ్ఞాన సంపన్నులైన జ్ఞాన వీరులు. బాబు పుట్టుపూర్వోత్తరాలు ఇతమిద్ధంగా ఎవరికి తెలియలేదు. ఈ మహనీయుడు బాల్యంలోనే మాతాపితరులకు దూరమై ఇల్లువిడచి యావద్భారతదేశంలోను గల అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఎంతోకాలం సాధన చేశారు. అగ్ర జాతులమని చెప్పుకునేవారు నిమ్నకులాల వారిని అంటరానివారుగా పరిగణించడం అవిద్యతో అలమటించిపోతున్న వారిపై దయ చూపకపోవడం వారిని ఆలయాలలోకి ప్రవేశింపనీయక పోవడం ఆయన హృదయాన్ని కలచివేసింది. అసమానతలు భేదబుద్ధి తొలగించుకుని అంతా సమభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన సుదీర్ఘ పర్యటనలలో జమీందారులు సంపన్నులు ఆయనకు ఆతిథ్యమిచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే నిరుపేదలు కొండ జాతుల వారి ఆతిథ్యాన్ని కూడా పొందారు. సంపన్నుల ఇళ్లలో పంచభక్ష్య పరమాన్నాలు నిరుపేదల ఇళ్లలో పచ్చడి మెతుకులు సమదృష్టితో చూచి ప్రీతిగా ఆరగించారు. 1936వ సంవత్సరంలో గుంటూరు, తుని పట్టణాలలో కొందరికి మాత్రమే ఆయన కనిపించారు. వారంతా ప్రముఖులు, వారికి ఎన్నో మహిమలు చూపారు. ఆయన దర్శనం చేసిన నాస్తికులు కూడా ఆయన సమ్మోహన శక్తిముందు డీలాపడిపోయి మహాభక్తులయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తనపై నమ్మకం పెంచుకున్న వారితోనే ఆయన సంచరించేవారు. పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులోను తరువాత కొంతకాలం రాజమహేంద్రవరంలోను దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. భీమవరం మరియు చుట్టుప్రక్కల గ్రామాలలోగల భక్తుల ఇండ్లకు వెళ్లేవారు యావన్మంది ప్రజలకు వెల్లడి కావడానికి ఆయనకు ఇష్టం ఉండేదికాదు. కాని ఆయన సర్వులకు వెల్లడికావాలని భక్తులు కోరుకునేవారు. అందుకు ఒక ఆశ్రమం నిర్మించాలని జయపుర సంస్థానాధీశులు విక్రమదేవవర్మ గుండుగొలను వాస్తవ్యులు మావులేటి చిరంజీవి రాజులంక శేషగిరిరావు భావించి ఆ విషయం ఆయనవద్ద ప్రస్తావించగా అప్పట్లో ఆయన సుముఖత చూపలేదు. నిరాసక్తతో ఇలా అన్నారు. ‘‘నాకు ఆశ్రమం కావాలనే కోరిక లేదు. పది మందికి వెల్లడికావాలని కూడా లేదు. జగన్మాత సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది’’అనే వారు. తరువాత భక్తులతో కలసి అనేక ఉత్తర దక్షిణ పుణ్యక్షేత్రాలు దర్శించారు. క్రమంగా భక్తులకు ఆశ్రమ నిర్మాణంపై ఆసక్తి ఎక్కువయింది. అందుకు ఆయనకు అనేక ప్రదేశాలు సూచించారు. చూద్దాం అని దాటవేసేవారు. చాల పర్యాయములు బాబు గుంటూరు విజయవాడ రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించేవారు.
ఒక పర్యాయం నంబూరు స్టేషను ఎదురుగా ఒక స్థలంపై అప్రయత్నంగా ఆయన చూపులు నిలిచిపోయాయి. అలా చాల పర్యాయములు జరిగింది. ఒకరోజు ఆయన ధ్యాన నిమగ్నుడై ఉండగా ‘‘నీ చూపులు అటువైపు మరలించినది నేనేరా. అది ఎందరో మహర్షులు పూర్వయుగాలలో తపస్సుచేసిన మహిమాన్వితమైన క్షేత్రం. నిన్ను ఆశ్రయిచినవారి మనోరధం సఫలం చెయ్యి. నీ జన్మ లక్ష్యమైన ఆత్మజ్ఞాన ప్రబోధానికి కేంద్రంగా ఉండే ఆశ్రమం ఏర్పాటుచేసుకోవడానికి అది అనువైన చోటు’’అని సూచింపబడింది. విజయవాడ, గుంటూరు నగరాలకి అది అత్యంత సమీపమైన స్థలం. రోడ్డుకు దూరంగా వాహనాల రద్దీలేని ప్రశాంత స్థలం. అటు మంగళగిరి నరసింహస్వామికి ఇటు పెదకాకాని సాంబశివునికి మధ్య నిలిచిన హరిహరతత్వ సమన్వయ కేంద్రమయి అమ్మ మెచ్చిన స్థలం. ఇన్ని కారణాలవలన బాబు ప్రసన్నులై అక్కడ ఆశ్రమ నిర్మాణానికి అనుమతించారు. 1971వ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆశ్రమ శంకుస్థాపన జరిగింది. 31.5.72వ తేదీ రాత్రి 1.36ని.లకు (తెల్లవారితే లక్ష్మీవారం) ‘శ్రీ బాబు విజ్ఞాన మందిరంలో తమ దేవతార్చన పీఠంతో ప్రవేశించి ఆ పీఠాన్ని అమ్మ గదిలో ప్రతిష్ఠించారు. 1988వ సంవత్సరం డిసెంబరు మూడవ తేదీన ఈ మహనీయుని అవతార పరిసమాప్తి జరిగింది. అనంతరం పీఠాధిపత్యాన్ని ఆయన ఆదేశంతోను ఆశీస్సులతోను యోగిని శ్రీ చంద్రకాళీప్రసాద్ మాతాజీ సమర్ధంగా నిర్వహిస్తున్నారు. నేడు ఈ ప్రదేశం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉండడం మన అదృష్టం. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు వివిధ పర్వదినాలు ఎంతో ఘనంగా ఇక్కడ జరుగుతాయి. ఇచ్చట నిత్యాన్నదానము క్రమశిక్షణ వివిధ దేవాలయాలను సందర్శకులు మరువలేరు.

chitram..సద్గురు శ్రీ హనుమత్కాళీ
వరప్రసాదబాబు

- వేదుల సత్యనారాయణ