Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శైశవంబున సంస్కార సారముగ్గు
పాలతో రంగరించియు నొంటఁబట్టు
నటుల తల్లులు ద్రావింపనరయ భావి
జీవితంబున ఘోరాలు సేయఁ బోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శైశవ దశలోనే సంస్కారసారాన్ని ఉగ్గుపాలతో రంగరించి ఒంటబట్టేలా తల్లులుత్రాగించిన పక్షంలో భవిష్యత్తులో వారు ఘోరాలకు పూనుకోరన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా ఈలోకంలోని తల్లులకు తెలియుజేయుమయ్యా.
తే.గీ. పిన్ననాటి నుండియె పాపభీతి మదిన
నాటుకొనునట్లు పెద్దలు మాటలెన్నొ
నూరిపోసిన పక్షాన వారి జీవి
తాలు వికసించి సార్థకత్వమునుఁ గాంచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పిల్లలకు చిన్నప్పటి నుంచి పాపభీతి అనేది మనసులో నాటుకునేలా పెద్దలంతా ఎనె్నన్నో సూక్తులు నూరిపోసిన పక్షంలో వారి జీవితాలు వికసించి సార్థకతను కల్గియుంటాయన్న వాస్తవాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా ఈలోకానికి ప్రబోధించు దినకర స్వామి.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262