Others

మనోనిగ్రహానికి దారి భగవత్ చింతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సు చాలా చంచల స్వభావమైనది. అనేకానేక ఆలోచనలు వస్తూనే ఉంటాయ. ఏదో ఒక ఆలోచన లేకుండా మనిషి అనేవాడు నిముషమైనా ఉండలేడు. కానీ ఏకాగ్రతతో మనసును నిశ్చలంగా ఏ ఆలోచనలు లేకుండా నిలిపినట్లయతే భగవంతుడు కూడా మనసుపై విజయం సాధించిన వారికి కనిపిస్తాడు. వారికి ఆధీనుడై ఉంటాడని పెద్దలు చెబుతారు.
మనసు ఒక్క క్షణలో వెయ్యోవంతు కూడా పనిలేకుండా కూర్చోలేదు. నిరంతరం ఏదో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఇలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియములకు ఆధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారములను వృద్ధి చేస్తుంది. ఇక ఏముంది ఇంద్రియాలకు లాలసుడైన మనిషి ఏది చేయకూడదో ఏది చేయవలెనో అన్న విచక్షణను కోల్పోతాడు.క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు వెంటనే అతని పురోగమనం కాస్తా తిరోగమనం వైపు మళ్లుతుంది. అతి తక్కువ కాలంలోనే అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటి కప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతో సత్సాంగత్యంతో మనసును అదుపులో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడమే మనో నిగ్రహం సాధించాడని అంటారు. మనో నిగ్రహం సాధించాలంటే అసలు మనసును అదుపులో ఉంచుకోవాలంటే కోరికలనుదూరం చేసుకోవాలి. కానీ ఇది బహుకష్టమైన పని. అందుకే మనసును ఎపుడూ భగవంతునిపైకి మరల్చాలి. భక్తి సామ్రాజ్యంలో భగవంతుని గూర్చి తెలుసుకొనే ప్రయత్నానాన్ని పూర్తిగా మనసుకే అప్పజెప్పాలి. భగవంతుని కథలను వెతకడం ఎపుడు మొదలుపెడుతుందో తప్పక ఆ మనసు భగవంతునిపైనే నిలిచిపోతుంది. పూలనుంచి సేకరించిన తేనెను గినె్నలో పోసి ఎపుడూ తుమ్మెదకు ఎదురుగా పెట్టి ఉంటే మరో పూవు కావాలని ఎందుకు ఎగురుతుంది? అట్లానే భగవంతుని గురించి అతని స్థానాలు అంటే దేవాలయాల గురించి అందలి మహిమ గురించి తెలుసుకోవడం ఆరంభిస్తే చాలు. మనసు పరిపరివిధాలుగా వెళ్లే మనసు కూడా ఎపుడూ భగవంతుని పాదాలపై వ్రాలి ంటుంది. రాత్రి అంతా కలువ పూలలోని మకరందాన్ని అంటి పెట్టుకుని ఉన్నట్టే తెల్లవారుతూనే కలువ పూరెక్కలన్నీ వాడిపోతున్న ఆతేనెకోసం రేకులు మూసుకొని పోతున్నా సరే తుమ్మెద అక్కడే ఉండిపోతుంది. ఆఖరికి సూర్యుని చూసి కలువ ముడుచుకునిపోతున్నా సరే తుమ్మెద ఆ రేకుల మధ్యలో నిలిచిపోయ ఆఖరికి చనిపోతుంది. అట్లానే భక్తి అనే కలువపూవులో పడిన భక్తుడు చివరకు ఆ భక్తవత్సలుడైన పరమేశ్వరుని సన్నిధికి చేరుకుంటాడు కనుక మనసును ఎపుడూ భగవంతునిపైనే పెట్టాలి. అపుడే మనో నిగ్రహం వీలు అవుతుంది. సులభమార్గం కూడా ఇదే. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకములను జయించగలుగుదురు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి అదుపులో ఉంటాయ. కీడు చేసే ఆ గుణాలు సద్గుణాలుమారి మానవుని శాంతికి మార్గాలు అవుతాయ.

- చివుకుల రామమోహన్