Others

ఔషధ గుణాల కరివేపాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. చారులోనూ, పులిహోరలోనూ కరివేపాకు లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, మంచి సువాసన వస్తాయి. అంతేకానీ కరివేపాకు వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు.. అనుకుంటారు చాలామంది. కానీ పొరబాగు. కరివేపాకులో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. అవేంటో చూద్దాం..
* కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
* కరివేపాకు, వేపను కలిపి నూరి ముద్దగా చేయాలి. అరకప్పు మజ్జిగలో ఒక స్పూను ముద్దను కలిపి పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి.
* మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకును విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది.
* కరివేపాకును మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానుతాయి.
* ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూన్ మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
* కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్ల కింద రోజూ పూస్తుంటే కంటి కింది వలయాలు మాయమవుతాయి.
* నీళ్ల విరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు, నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయి.
* తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒక స్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండు పూటలా తీసుకుంటుంటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.