Others

పట్టుదలతో గెలిచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై రెండు దేశాలు పాల్గొన్న ‘రా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీల్లో భారతదేశానికి చెందిన రోమా నాలుగు పతకాలను కైవసం చేసుకుంది. 22 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారతదేశానికి చెందిన మహిళల తరఫున రోమా షా ఒక్కటే ప్రాతినిధ్యం వహించింది. అలా సంవత్సరాంతంలో అథ్లెట్ రోమా షా భారత మహిళల సత్తాను ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పింది. రోమా కంప్యూటర్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు పవర్ లిఫ్టింగ్‌ను ఎంచుకుని ఆడేది. గత మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్న రోమా.. నేడు అత్యున్నత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని రకాల ఆటలు ఆడే రోమా.. ఒక వయస్సు వచ్చాక పవర్ లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. దీనికోసం ఆమె ఎంతగానో శ్రమించింది. మొదట పూర్తి శాకాహారిగా ఉన్న ఆమె.. ఈ ఆటలో శరీర దారుఢ్యం కోసం మాంసాహారాన్ని తీసుకుందట. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రోమా ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె కోచ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో జరిగే ఈ పోటీలు ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరిగాయి. -6 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏ అథ్లెట్‌కైనా ప్రదర్శన అంత సులభం కాదు. ఇక భారతదేశం వంటి ఉష్ణదేశాల వారికి మరీ కష్టంగా ఉంటుంది. దానికి తోడు విమాన సమస్యల వల్ల పోటీకి కేవలం 24 గంటల ముందు మాత్రమే అక్కడికి చేరుకున్నాం. దానితో ఈ ఏడాది ప్రపంచ రా పవర్‌లిఫ్టింగ్ పోటీ చాలా కఠినంగా మారింది. ఈ సమయంలో రోమా తన బరువు నియంత్రణలో ఉంచుకోవడం సవాలుగా మారింది. తన క్రమశిక్షణ, దీక్ష, నిరంతర సాధన వల్ల ఆమె గొప్ప ఫలితాలను సాధించి దేశానికి కీర్తిని సంపాదించి పెట్టింది’ అన్నాడు. అలా సంవత్సరాంతంలో రోమా షా తన సత్తాను చూపించి భారతదేశానికి విజయాన్ని అందించింది.